e-cigarette review Ping Yahoo GOSSIPS: 2010

Friday, December 31, 2010

తమన్నా కి నిజంగా అంత సీనుందా?


 
 
 
 
            ముంబై భామలకి ముందుగా అవకాశాలు, నాలుగు డబ్బులు తెచ్చిపెట్టేది టాలీవుడ్డు, కాకపొతే కోలీవుడ్డు. ఇక్కడ ఛాన్సులు లేకపోతే అక్కడికీ, అక్కడ లేకపోతే ఇక్కడికీ షిఫ్ట్ అవ్వడానికి రెడీగా ఉంటూ వుంటారు. ఇప్పుడు తమన్నా కూడా అదే పనిలో వుంది. ముందు టాలీవుడ్ లో ట్రై చేసింది. అయితే ఇక్కడ సినిమాలు లేకపోవడంతో కోలీవుడ్ వెళ్లిపోయింది. రెండేళ్ల క్రితం వచ్చిన 'కొంచం ఇష్టం-కొంచం కష్టం' సినిమా తన జాతకాన్ని మార్చేస్తుందని ఎంతగానో ఆశించింది. కానీ, అది ఢమాల్ మనడంతో తనకి తెలుగులో అవకాశాలు రాలేదు. అయితే ఇలా అంటే, తమన్నా ఒప్పుకోదు. "ఆ సినిమా తర్వాత తెలుగులో చాలా కధలు విన్నాను. కానీ నాకు నచ్చలేదు. అందుకే ఏవీ కమిట్ కాలేదు. తమిళ్ లో మంచి ఆఫర్లు వచ్చాయి. ఏ సినిమా అయినా ఒప్పుకునే ముందు కధ, నా క్యారక్టర్, హీరో... ఈ మూడూ నాకు నచ్చాలి. అప్పుడే ఓకే చెబుతాను" అంటూ మనకి 'కధ'లు చెబుతోంది. అయినా తమన్నాకి ఇంత సీనుందా ఇక్కడ?  

'అమలాపురం మంగమ్మ' వస్తోంది

 
 
 
 
          మొన్నామధ్య అనుష్క 'అమలాపురం సరోజ'గా 'వేదం' సినిమా లో ప్రేక్షకుల్ని అలరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే కోవలో విమలా రామన్ 'అమలాపురం మంగమ్మ'గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ 30 న విడుదల కాబోతున్న 'రంగ ది దొంగ' సినిమాలో ఆమె చేసిన పాత్ర పేరు అదే. అందులో తను పోలీస్ ఇన్స్ పెక్టర్ గా కనిపిస్తుంది. చీటికి మాటికి 'అయ్ బాబోయ్... ' అంటూ గోదావరి యాసలో మాట్లాడుతూ అందర్నీ నవ్విస్తుందట. ఇంకో విశేషమేమిటంటే, ఆ సినిమా షూటింగులో అందరూ తనని ఈ పోలీస్ డ్రెస్ లో చూసి విజయశాంతి తో పోల్చేవారట. "విజయశాంతి నటించిన యాక్షన్ సినిమాలన్నీ చూసాను. ఆవిడెక్కడ... నేనెక్కడ? ఆమెను ఇన్స్ పెరేషన్ గా తీసుకుని చేసాను" అంటోంది అమలాపురం మంగమ్మ. 

Thursday, December 30, 2010

ఆమిర్ ఖాన్, రాజమౌళి మీటింగ్!


 
 
 
 
            దర్శకుడు రాజమౌళి ఇప్పుడు చాలా ఎగ్జయిటింగ్ గా వున్నాడు. ఎంత అంటే, మాటల్లో చెప్పలేనంత! ఎందుకంటే, తాను ఎంతో అభిమానించే ఓ స్టార్ ని కలుసుకోబోతున్నాడు. రాజమౌళి అభిమానించే ఆ హీరో ఎవరనుకుంటున్నారా? మరెవరో కాదు... బాలీవుడ్ లో ప్రయోగాత్మక, సాహసాత్మక సినిమాలు తీసే హీరో ఆమిర్ ఖాన్! అవును... రాజమౌళి రేపు (డిసెంబర్ 31 ) ఆమిర్ ని కలవనున్నాడు. "వావ్...చాలా ఎగ్జయిటింగ్ గా వుంది. ఆమిర్ ని రేపు కలుస్తున్నాను. అలాగని చెప్పి ఏదో సినిమా చేస్తున్నామని ఏవో ఊహించేసుకోకండి" అంటున్నాడు రాజమౌళి. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే, 'మగధీర' సినిమా గురించి తెలుసుకుని, ఆ సినిమా చూడాలన్న కోరికను వ్యక్తపరిచాడు ఆమిర్. దాంతో ప్రింట్ పంపించి చూపించారు. చూసిన వెంటనే ఫోనే చేసి, రాజమౌళిని ఆమిర్ ఎంతగానో అభినందించాడట. ఆ సందర్భంగా 'మిమ్మల్ని క్యాజువల్ గా కలవాలని వుంది' అని రాజమౌళి అనగానే, 'మోస్ట్ వెల్ కమ్' అంటూ మనస్పూర్తిగా ఆహ్వానించాడట. సో .. రేపు జరగబోయే ఈ మీటింగ్ ఓ పెద్ద హిందీ సినిమా ఆవిర్భావానికి దారితీయచ్చేమో!  

'నో సీనియర్స్' అంటున్న అల్లు శిరీష్

 
 
 
 
             యంగ్ హీరో అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ కి సినిమాల పట్ల మంచి నాలెడ్జ్ వుంది. ఇంటర్నేషనల్ సినిమా గురించి, సినిమా టెక్నాలజీ గురించీ కూడా బాగా మాట్లాడతాడు. అయితే అతనికి సినిమా నిర్మాణం కన్నా మీడియా బిజినెస్ అంటే ఎక్కవ ఇష్టమట. అందుకే, 'సౌత్ స్కోప్' పేరుతో ఓ ఇంగ్లిష్ సినిమా మేగజైన్ నడుపుతున్నాడు. సదరన్ సినిమాని ఎక్కువగా కవర్ చేస్తారిందులో. ఈ మేగజైన్ తరఫున ప్రతి ఏడూ సినిమా తారల ఫోటోలతో కూడిన కేలెండర్ ఒకటి వేస్తుంటాడు. దానికోసం బాగా ఖర్చు పెట్టి, ప్రముఖ  తారలతో ఫొటో సెషన్లు కూడా చేయిస్తుంటాడు.
           అయితే ఈ ఏడాది సీనియర్స్ ని వదిలేసి కేవలం యంగ్ స్లాట్ తోనే కేలండర్ వేస్తున్నాడు. హీరోలు అల్లు అర్జున్, రానా, నాగ చైతన్య, జీవా, కార్తి, దిగంత్, హీరోయిన్లు సమంతా, కాజల్, తమన్నా, శ్రియ, శృతి హాసన్, నిధి లతో కేలండర్ ని రూపొందిస్తున్నాడు. దీని కోసం అల్లు అర్జున్ తన హెయిర్ స్టయిల్ కూడా మార్చుకున్నాడు. ఈ కేలండర్ ని జనవరి ఫస్ట్ వీక్ లో ఓ వేడుకలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే, ఈ మేగజైన్ మాత్రం చాలా లాస్ లో నడుస్తోందని అందులో పనిచేసే వాళ్లు చెబుతున్నారు!    

బోయపాటి శ్రీను సినిమా ఎప్పుడు?


 
 
 
 
      అసలు ఒక పెద్ద హిట్ సినిమా పడగానే ఆ సినిమా డైరెక్టర్ యమా బిజీ అయిపోతాడు. బోయపాటి శ్రీను విషయంలో ఇది రివర్స్ అయిందనే చెప్పాలి. 'సింహా' రిలీజ్ అయి, సూపెర్ హిట్ అవగానే, అతనికి చాలా ఆఫర్లు వచ్చాయి. మూడు కోట్లు ఆఫర్ చేసిన వాళ్లు కూడా వున్నారు. అయితే, దేనికీ కమిట్ కాకుండా యన్టీఆర్ తో చేయడానికే అతను కమిట్ అయ్యాడు. అయితే, ఆ ప్రాజక్టు 'అదిగో...ఇదిగో' అంటూ ఊరిస్తోందే కానీ,  మొదలవడం లేదు. స్క్రిప్ట్ దగ్గరే ఏదో ప్రాబ్లం వచ్చిందంటున్నారు. దాంతో అది ముందుకి సాగడం లేదు. ప్రస్తుతం యన్టీఆర్ 'శక్తి' సినిమా పూర్తి చేసే పనిలో వున్నాడు. ఈలోగా మరో వార్త. చిరంజీవి 150 వ చిత్రానికి బోయపాటి దర్శకత్వం వహిస్తున్నాడని. అయితే, అదీ కన్ఫర్మ్ కావడం లేదు. ఏదైనా ఒక పెద్ద సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టరు ఇలా ఎనిమిది నెలల నుంచి ఖాళీగా వుండడం మాత్రం బాగోలేదు. ఒక విధంగా అది అతని స్వయంకృతాపరాధమేనేమో!

నాగ్ 'రాజన్న' కోసం భారీ సెట్స్


 
 
 
 
           ఇటీవల విడుదలైన 'రగడ' సినిమా మంచి కలక్షన్లు వసూలు చేస్తుండడంతో నాగార్జున ఇప్పుడు మంచి జోష్ లో వున్నారు. ఈ నేపధ్యంలో తన తదుపరి చిత్రం 'రాజన్న' షూటింగ్ కోసం ఆయన ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా కోసం ఇప్పటికే నిజాం కాలం నాటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా భారీ సెట్స్ వేయడం జరిగిందని నాగ్ చెప్పారు. చిత్ర పరిశ్రమ బంద్ వల్ల షూటింగ్ ఆగిందనీ, లేకపోతే ఈపాటికి ఆ సినిమా షూటింగులోనే ఉండేవాడినని ఆయన అన్నారు. 1940 ల నాటి కధ ఇదనీ, తెలంగాణా వీరునిగా ఇందులో నటిస్తున్నందుకు ఆనందంగా ఉందనీ చెప్పారు. రచయిత విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారనీ, రాజమౌళి యాక్షన్ సీన్స్ డైరెక్ట్ చేస్తారనీ నాగ్ చెప్పారు. ఇదిలావుంచితే, ఫిబ్రవరి 12 నుంచి శ్రీనివాస రెడ్డి డైరెక్షన్ లో రూపొందే సోషియో ఫాంటసీ చిత్రం ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు.

తాప్సీకి రాఘవేంద్ర రావు సెంటిమెంట్!


 
 
 
 
         దర్శకుడు రాఘవేంద్ర రావు హస్తవాసి చాలా మంచిదంటారు టాలీవుడ్ లో. అంటే, ఎవరైనా ఆయన సినిమాలో యాక్ట్ చేస్తే ఇక వాళ్లు స్టార్లు అయిపోతారని సెంటిమెంట్.   ఇప్పుడిది తాప్సి విషయంలోనూ నిజమైంది. ఆయన తెలుగుతెరకు పరిచయం చేసిన తాజా గ్లామర్ తాప్సి. 'ఝుమ్మంది నాదం' సినిమా ద్వారా ఆమె అందచందాలను ఎక్కడా వదలకుండా వెండితెరపై తనదైన శైలిలో ఆవిష్కరించి, ఆమెకో చక్కని ఫ్లాట్ ఫాం ను ఏర్పాటు చేసారాయన. ఒళ్లంతా అందాన్ని నింపుకున్న ఈ సుందరాంగి ప్రస్తుతం 'వస్తాడు నా రాజు', 'మిస్టర్ పెర్ ఫెక్ట్' సినిమాలలో నటిస్తోంది. కాగా, తాజాగా యన్టీఆర్ తో నటించే అవకాశాన్ని కూడా తాప్సి పొందినట్టు తెలుస్తోంది. యన్టీఆర్ తో సురేందర్ రెడ్డి రూపొందించే 'రచ్చ' చిత్రంలో ఈమె నటించనుంది. ప్రస్తుతం ఓ తమిళ చిత్రం షూటింగ్ కోసం ఈ భామ పాండిచ్చేరిలో ఉంది.

అనుష్క పేరు మారిపోయిందిప్పుడు!


 
 
 
 
           ఇప్పుడు అందాల అనుష్క పేరు మారిపోయింది. అయితే తనంత తానేమీ మార్చుకోలేదు. చుట్టూ వున్నా వాళ్లు మార్చేసారట. ఇంతకీ ఏమిటనుకుంటున్నారు... ఆ కొత్త పేరు? శిరీష....! ఇప్పుడు తనని అంతా ఆ పేరుతోనే పిలుస్తున్నారట. ఈపాటికి అసలు విషయం మీకు కాస్త అర్ధమయ్యేవుంటుంది. అవును, ఇటీవల విడుదలైన 'రగడ' సినిమా లో అనుష్క వేసిన పాత్ర పేరు 'శిరీష'. ఆ సినిమాలో 'శిరీషా...శిరీషా..ఎంత పని చేసావు శిరీషా?' అంటూ ఓ పాట కూడా వుంది కదా.. దాంతో సన్నిహితులంతా ఈమెను కలిసినప్పుడు సరదాగా నవ్వుతూ ఆ పాటే పాడుతున్నారట. దీంతో స్వీటీ ఇప్పుడు మరింత స్వీట్ గా మారిపోయింది. "రగడ హిట్ అవడం చాలా హ్యాపీగా వుంది నాకు. నిజానికి ఈ మధ్య కెరీర్ పరంగా కాస్త అప్సెట్ అయ్యాను. ఇప్పుడీ సినిమా ఆ లోటు తీర్చేసింది" అంటూ సంబరపడిపోతోంది శిరీష... సారీ... అనుష్క.

ఐశ్వర్యా రాయ్ పెట్టిన కండిషన్


            జీవితంలో పెద్ద స్థాయికి చేరుకున్న వాళ్లకి అన్ని రకాలుగానూ డబ్బులే. అందులోనూ సినీతారలకైతే చెప్పేక్కర్లేదు. అటు సినిమాలు, ఇటు వాణిజ్య ప్రకటనలు... స్టేజ్ షోలు... రకరకాల ఇన్ కమ్. ఇప్పుడు అందాల తార ఐశ్వర్యారాయ్ పనీ అలాగే వుంది. ఎడాపెడా ఆదాయమే. తాజాగా మరో కొత్త ఆఫర్ వచ్చింది. ఆమె జీవిత చరిత్రను పుస్తక రూపంలో ప్రచురించడానికి ఓ విదేశీ ముద్రణా సంస్థ ముందుకొచ్చింది. ఇటీవల ఐష్ ని కలిసి తమ ఆఫర్ ని ఆమె ముందుంచి, పారితోషికంగా ఓ బ్లేంక్ చెక్ ఆఫర్ చేసారట. ఐష్ ఆ ఆఫర్ కి టెంప్ట్ అయిందట. అయితే, ఆ పుస్తకంలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదాస్పద విషయాలను టచ్ చేయకూడదని కండిషన్ పెడుతోందట. దాంతో సదరు ప్రచురణ కర్తలు ఆలోచనలో పాడ్డారు. ఎందుకంటే, సల్మాన్, వివేక్ ఒబెరాయ్ లతో ఆమె సన్నిహిత్వానికి చెందిన వివాదాస్పద అంశాలను పక్కన పెడితే ఇక ఆ పుస్తకానికి విలువేముంటుంది? దానిని ఎవరు కొంటారు?   

పరమ వీర చక్ర పాటలు.


 
 

దాసరికి బాలచందర్ చేతుల మీదుగా సన్మానం

దర్శకుడిగా దాసరి నారాయణరావు రికార్డులు అందరికీ తెలిసినవే. ఇప్పుడు 'పరమ వీర చక్ర' చిత్రం ఆయనకు 150 వ చిత్రం. ఈ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నందుకు 'పరమ వీర చక్ర' ఆడియో వేడుకలో దాసరికి మరో ప్రముఖ దర్శకుడు బాలచందర్ చేతుల మీదుగా ఘన సన్మానం జరిగింది. శాలువా కప్పి, నిలువెత్తు గజమాలను వేసి, నిలువెత్తు సన్మాన పత్రాన్ని సమర్పించి దాసరిని సత్కరించారు. ఈ సందర్భంగా సభికులంతా  స్టాండింగ్ ఒవేషన్ తో దాసరికి అభినందనలు తెలిపారు.  మరో విశేషమేమిటంటే, ఇదే వేదికపై ప్రముఖ తమిళ దర్శకుడు రామనారాయణకు దాసరి సన్మానం చేసారు. రామనారాయణ 120 చిత్రాలకు దర్శకత్వం వహించారు.

ఇక నుంచి టాలీవుడ్ లో షూటింగులు


 
 
 
 
        గత మూడు వారాలుగా టాలీవుడ్ లో నిర్మాతలు, కార్మికుల  మధ్య నెలకొన్న వివాదం ఈరోజు (డిసెంబర్ 29 ) సాయంకాలం పరిష్కారమవడంతో కధ సుఖాంతమైంది. కార్మికుల డిమాండ్ల ప్రకారం వేతనాలు, దినసరి భత్యాలు పెంచడానికి నిర్మాతలు అంగీకరించడంతో వివాదం సమసిపోయింది. పెరిగిన వేతనాలు వచ్చే మార్చి ఒకటి నుంచి అమలులోకి వస్తాయి. దీంతో పాటుగా ఫైటర్ల వివాదం కూడా పరిష్కారమైంది. ఇక నుంచి (డిసెంబర్ 30 ) మళ్లీ షూటింగులతో టాలీవుడ్ కళకళలాడుతుంది.

"పరమ వీర చక్ర కొత్త రికార్డులు నెలకొల్పుతుంది" -బాలకృష్ణ


 
 
 
 
         బాలకృష్ణ హీరోగా దాసరి దర్శకత్వంలో సి.కల్యాణ్ నిర్మిస్తున్న 'పరమ వీర చక్ర' చిత్రం ఆడియో  సీడీని ప్రముఖ దర్శకుడు కే.రాఘవేంద్ర రావు విడుదల చేయగా, యంగ్ హీరో యన్టీఆర్ తొలి సీడీని స్వీకరించారు. ఈ సందర్భంగా చెన్నై నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన ముఖ్య అతిథి కే.బాలచందర్ తన శుభాభినందనలను తెలియజేసారు. యన్టీఆర్ మాట్లాడుతూ, ఈ సినిమాలోని కొన్ని బిట్స్ చూశాననీ, బాబాయ్ పోషించిన గెటప్స్ చూడడానికి రెండు కళ్ళూ చాలవనీ అన్నారు. ఫుల్ సినిమా ఎప్పుడు చూస్తానా అన్న క్యురియాజిటీతో వున్నానని అన్నారు. దర్శకుడు దాసరి చెబుతూ, "యన్టీ రామారావు గార్ని ఊహించుకొని ఈ సినిమా చేసాను. బాలయ్యలో ఆయననే చూస్తాం. అంత అద్భుతంగా చేసాడు బాలయ్య. రామారావు గారు ఎప్పుడూ అనేవారు, 'నా రాజకీయ ప్రవేశానికి 'సర్దార్ పాపారాయుడు', 'బొబ్బిలి పులి' సినిమాలు ఎంతగానో స్పూర్తినిచ్చాయ'ని. మరి రేపు, ఈ సినిమా ఎన్ని మలుపులకు కారణం అవుతుందో! రామారావు గారిలో చూసిన క్రమశిక్షణను మళ్లీ బాలయ్యలోనే చూసాను. వినయ విధేయతలు గల విధ్యార్ధిలా కనిపించాడు బాలయ్య. ఈ సినిమా గురించి ఇప్పుడు ఎక్కువ మాట్లాడను. రేపు సినిమానే మాట్లాడుతుంది" అన్నారు.
       బాలకృష్ణ మాట్లాడుతూ, "దర్శకరత్న దాసరి గారి 'శివరంజని' లో నేను నటించాలి. కానీ అప్పుడు చదువుకుంటున్నాను కాబట్టి నాన్నగారు అంగీకరించలేదు. వారితో పనిచేసే అదృష్టం ఇప్పటికి లభించింది. బొబ్బిలిపులి లో నాన్న గారికి పరమ వీర చక్ర అవార్డు ఇస్తారు. ఇప్పుడు అదే మాకు టైటిల్ అయింది. కృషితో నాస్తి దుర్భిక్షం అన్న నానుడిని నేను నమ్ముతాను. అలాగే దీనికి అందరం కష్టపడ్డాం. ఇది విజయవంతం కావడం ఖాయం.  ఇందులో పౌరాణిక గెటప్ లు వున్నాయి. ఇది మళ్లీ పౌరాణిక చిత్రాలకు నాంది పలకాలి. మణిశర్మ ఇచ్చిన మణిపూసల వంటి బాణీలు ఇందులో వున్నాయి. మంచి సినిమా చేసాం. ఇండియా గర్వించదగ్గ దర్శకులు దాసరి గారు. ఆయన నిత్య శ్రామికుడు. అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి ఆయన. రేపు ఇది పాత రికార్డులను తుడిచిపెట్టి, కొత్త రికార్డులను నెలకొల్పుతుంది" అన్నారు.  ఈ కార్యక్రమంలో ఇంకా కే.విశ్వనాథ్, రాజమౌళి, బోయపాటి శ్రీను, కోట, బ్రహ్మానందం, అలీ, శ్రీను వైట్ల, వి.వి.వినాయక్  తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచీ వచ్చిన బాలకృష్ణ అభిమానులు చాలా సందడి చేసారు. ఝాన్సి ఈ వేడుకకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది.

దీక్షా సేథ్ చెబుతున్న గ్లామర్ కబుర్లు

 
 
 
 
          అందచందాలు ఉండగానే సరిపోదు, జంకూకొంకూ లేకుండా వాటిని ప్రదర్శించడంలోనే నేటి హీరోయిన్ సక్సెస్ దాగి వుంది. తమ అందాలను ఎంతెలా ఎగ్జిబిట్ చేయగలిగితే అంతలా సక్సెస్ కావచ్చిక్కడ. ఇప్పుడు దీక్షా సేథ్ కూడా ఈ సూత్రంలో నమ్మకాన్ని పెంచుకుంది. 'వేదం' సినిమాలో అలాగే నేటి తరం అమ్మాయికి ప్రతినిధిలా గ్లామరస్ గా కనిపించి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. తాజాగా 'మిరపకాయ్' చిత్రంలో అయితే, 'వారేవా' అనే రేంజ్ లో తన అందాల ప్రదర్శన చేసిందట. "ఇందులో 'వేదం'కు మించిన గ్లామర్ గా కనపడతాను. యూత్ కి ఇంకా బాగా నచ్చుతాను" అంటోంది దీక్ష. సినిమా భాషలో 'గ్లామర్' అంటే ఇప్పుడు అందాల ప్రదర్శనే లెండి. అందుకే ఇప్పుడు దర్శక నిర్మాతలు దీక్ష వైపు దృష్టి సారిస్తున్నారు. ఒళ్లు దాచుకోకుండా అందాల ఆరబోత చేసే వాళ్లకి సినిమా రంగం ఎప్పుడూ రెడ్ కార్పెట్ పరుస్తుంది కదా? 

ప్రభు-నయన్ లకు లైన్ క్లియర్

 
 
 
             గత కొన్నాళ్లుగా నయనతారకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ప్రభుదేవా ప్రేమాయణం వివాదం ఓ కొలిక్కి వచ్చింది. ప్రభు దేవాపై కోర్టుకెక్కిన భార్య రమాలత్ ఎట్టకేలకు విడాకులకు అంగీకరించింది. తాజాగా కోర్టు ముందు ఆమె ప్రభుదేవాతో విడాకులకు ఒప్పుకుంటున్నట్టు ప్రకటించింది. కోర్టు వెలుపల జరిగిన ఒప్పందం ప్రకారం భార్యకు 30 కోట్ల వరకు ముట్టచెబుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ మొత్తంలో నగదుతో బాటు స్థిరాస్తులు కూడా వున్నాయి. ఏదో విధంగా వివాదం పరిష్కారమై లైన్ క్లియర్ అయినందుకు ప్రభు, నయన్ లు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇక వివాహం చేసుకుని హాయిగా కాపురం చేయాలనుకుంటున్నారు. జనవరి నెలాఖరుకి మేరేజ్ చేసుకోవడానికి ఈ జంట ప్లాన్ చేసుకుంటోంది.  

ఇలియానా 'పెళ్లి' ముచ్చట్లు

 
 
 
 
         ఇది తారలకు పెళ్లిళ్ల సీజన్ లా వుంది. అంటే, వాళ్లు చేసుకుంటున్నారని కాదు. వాళ్లు దగ్గరుండి తమ స్నేహితుల పెళ్లిళ్లు చేస్తున్నారు. మొన్న త్రిష దుబాయ్ లో ఇలా తన స్నేహితురాలికి పెళ్లి జరిపిస్తే, నిన్న గోవా బ్యూటీ ఇలియానా వాళ్ల ఫ్రెండ్ పెళ్లి దగ్గరుండి జరిపించింది. ఆ ఫ్రెండ్ పేరు కిమ్. పెళ్లి డ్రెస్ లో కిమ్ చాలా అందంగా వుందని కాంప్లిమెంట్ కూడా ఇచ్చింది. "కిమ్ పెళ్లి పుణ్యమా అని నిన్న రాత్రి ఫ్రెండ్స్ అందరితోనూ బాగా గడిపాను. చాలా సందడి చేసాం. చాలా రోజుల తర్వాత మళ్లీ ఫ్రెండ్స్ అంతా కలిసినందుకు చాలా హ్యాపీగా వుంది" అంటోంది ఇలియానా. కాలేజ్ లో వీళ్లంతా బాగా అల్లరి చేసేవారట. "కిమ్, వీమ్, నేను... మేముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్. ఎక్కడికెళ్ళినా ముగ్గురం వెళ్లేవాళ్లం. మా ముగ్గురికీ 'చార్లీస్ ఏంజిల్స్' అనే నిక్ నెమ్ కూడా వుండేది" అంటోంది ఈ గోవా బ్యూటీ.

స్నేహా ఉల్లాల్ కి కోపమొచ్చింది!

 
 
 
 
          ఐశ్వర్యా రాయ్ తో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గొడవపడ్డాక, ఆమెకు పోటీగా స్నేహ ఉల్లాల్ ని తెరపైకి తెచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఐష్ పోలికలు ఉండడమే స్నేహాకి ప్లస్ పాయింట్ అయింది. ఆమెను తొలిసారిగా చూసిన వాళ్లంతా నిజంగా ఐష్ అనే అనుకున్నారు. అయితే బాలీవుడ్ లో సక్సెస్ కాలేకపోయిన స్నేహా 'ఉల్లాసంగా... ఉత్సాహంగా' చిత్రంతో టాలీవుడ్ కి వచ్చింది. ఆ తర్వాత 'కరంట్', 'సింహా' చిత్రాలు చేసింది. ఇక్కడ కూడా ఆమెను ఐష్ తోనే పోలుస్తూ ఆదరిస్తున్నారు. కొంత మంది కాస్త ముందుకెళ్లి అసలు పేరు వదిలేసి, 'జూనియర్ ఐష్' అంటూ ఈ అమ్మడిని పిలుస్తుండడంతో ఆమెకు కోపం ముంచుకొస్తోంది. 'నన్నలా పిలవకండి' అంటూ రుసరుసలాడుతోంది. "ఇంత పేరు తెచ్చుకున్నాక కూడా ఇంకా నన్ను ఆమెతో పోలుస్తారేమిటి? నాకు వ్యక్తిత్వం లేదా? నన్ను నన్నుగా చూడండి, నా పేరుతోనే నన్ను పిలవండి" అంటూ క్లాస్ కూడా పీకుతోంది. ఆమాత్రం కూడా ఐష్ పోలికలు లెకపోతే, ఈమాత్రం ఆఫర్లు కూడా రావన్న సంగతి ఈ బుల్లెమ్మ మర్చిపోతే ఎలా?    

Wednesday, December 29, 2010

జెన్నీ ఫిలాసఫీ తెలుసా?

 
 
 
 
            'ఆరెంజ్' సినిమా పెద్ద ఫ్లాప్ అవ్వడంతో కధానాయిక జేనీలియాకి వైరాగ్యం వచ్చినట్టుంది. "మన చేతుల్లో ఏముంది... ఏమీ లేదు. అంతా ఆ పైవాడి దయ" అంటోంది. ప్రస్తుతం జెన్నీకి తెలుగులో సినిమాలేమీ లేవు. దాంతో ముంబైలో ఇంట్లో కూర్చొని టైం పాస్ చేస్తోంది. "ఒక సినిమా జయాపజయాలు ఎవరి చేతుల్లోనూ వుండవు. మనం ఎంత బాగా చేసినా ఒక్కోసారి సక్సెస్ కాలేము. అందుకే చేయడం వరకే మన డ్యూటీ. రిజల్ట్ కోసం వెయిట్ చేయను. అది పట్టించుకోను కూడా. హిట్ అయిందని ఎవరైనా చెబితే, సంతోషిస్తాను. ఫ్లాప్ అని చెబితే కాస్సేపు ఫీలవుతాను. సినిమా ఫెయిల్ అవ్వచ్చేమో కానీ నటిగా మాత్రం నేను ఫెయిల్ కాను కదా... ఆ నమ్మకం నాకుంది. అయినా ఫీలయ్యి కూడా మనమేమీ చేయలేం కదా?" అంటూ వేదాంతం చెబుతోంది. అన్నట్టు 'ఆరెంజ్' సినిమా విషయంలో దర్శకుడు భాస్కర్ మీద నాగబాబు చేసిన విమర్శలు ఈ అమ్మడుని బాగా బాధించాయట. అతనికి ఫోన్ చేసి ఓదార్చిందట కూడా!    

శ్రియ ఈసారి ఆ తప్పు చేయదట!

 
 
 
 
         పాపం... శ్రియ పరిస్థితి చూస్తే ఇప్పుడంతా ఇలాగే సానుభూతి చూపిస్తున్నారు. ఎందుకంటే, ఈ భామకి సౌత్ లో ఇప్పుడు సినిమాలేవీ లేవు. దానికి తోడు బాలీవుడ్ లో చేసిన ఒకటీ అరా చిత్రాలు కూడా తుస్ మన్నాయి. దీని గురించే కదిలిస్తే, "అవును... అనుభవ లేమితో సినిమాల ఎంపికలో కొన్ని తప్పులు చేసాను. కధల్ని సరిగ్గా జస్టిఫై చేయలేకపోయాను. దాంతో చేసిన సినిమాలు క్లిక్ అవలేదు. అయినా బాలీవుడ్ ని వదిలేది లేదు. ఈసారి చూడండి... మంచి సినిమాలు సెలెక్ట్ చేసుకుంటాను. బాలీవుడ్ లో సక్సెస్ అవుతాను" అంటోంది శ్రియ. అయితే, ఆఫర్లు ఇచ్చేవాళ్లు ఎవరైనా వుండాలి కదా? పైగా ఇప్పటికే నటిగా పదేళ్ల కెరీర్ అయిపోయింది. దాంతో బాటు గ్లామరూ కరిగిపోతోంది. వెనక్కి తిరిగి చూస్తే, తనకంటే చిన్నపిల్లలు తరుముకొచ్చేస్తున్నారు. మరి శ్రియకు ఈ సంగతి తెలియదా?

బాలచందర్ కు అక్కినేని అవార్డు


 
 
 
 
        ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వర రావు నెలకొల్పిన అక్కినేని జాతీయ అవార్డును ఈ ఏడాది ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ కు ప్రదానం చేస్తున్నట్టు అక్కినేని ట్రస్ట్  అధ్యక్షుడు టి.సుబ్బరామిరెడ్డి తెలియజేసారు. ఈరోజు (డిసెంబర్ 28) ఉదయం హైదరాబాదులోని అన్నపూర్ణా స్టూడియోలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన ఈ విషయం తెలిపారు. వచ్చే జనవరి 11 సాయంకాలం హైదరాబాదులోని శిల్పకళావేదికలో జరిగే ఓ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ఈ అవార్డు ప్రదానం జరుగుతుందని ఆయన చెప్పారు. అవార్డు కింద మెమెంటో తో బాటు నాలుగు లక్షల రూపాయల నగదు బహుమతి కూడా ప్రదానం చేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా అక్కినేని చెబుతూ, "బాలచందర్ గారు గొప్ప దర్శకులు. ఎన్నో గొప్ప చిత్రాలు తీసారు. అయితే, ఆయన దర్శకత్వంలో నేను నటించలేదు. ఆ అవకాశం నాకు రాలేదు" అన్నారు. తన తదనంతరం తన పిల్లలు ఈ అవార్డును కొనసాగిస్తారని ఓ ప్రశ్నకు సమాధానంగా అక్కినేని చెప్పారు.

వర్మ బ్లాక్ లో టికెట్ కొంటాడట


 
 
 
 
        రాంగోపాల్ వర్మ ఇంతకుముందు తెలుగు సినిమాలను 'మిడియోకర్' ఫిల్మ్స్ గా చూసేవాడు. అస్సలు లెక్కలోకి తీసుకునేవాడు కాదు. పైగా వాటికి పేర్లు కూడా  పెట్టేవాడు. చాలా చీప్ గా చూసేవాడు. అయితే ఇప్పుడు తన స్ట్రెటజీ మార్చాడు. కొన్ని సినిమాలని తెగ పొగిడేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం 'నేను-నా రాక్షసి' సినిమా బిట్స్ చూసి ఇలియానాని ఆకాశానికి ఎత్తేశాడు. ఇప్పుడు రవితేజాని కూడా అంత పనీ చేస్తున్నాడు. ఈవేళ 'మిరపకాయ్' సినిమాకి సంబంధించిన ట్రైలర్ చూసాడట. ఇంకేముంది, వెంటనే ట్విట్టెర్ కి పని చెప్పాడు. "ఇంతకు ముందు ఇంతిలా ఏం ఎంజాయ్ చేసానో గుర్తు రావడం లేదు. 'మిరపకాయ్' కి ఫస్ట్ డే, ఫస్ట్ షో కి, బ్లాక్ లో టికెట్ కొనుక్కుంటాను" అంటున్నాడు. వర్మ ఎందుకిలా కాంప్లిమెంట్స్ ఇస్తున్నాడా? అని టాలీవుడ్ జనం ఆరా తీస్తున్నారు. ఎందుకంటే, వర్మ ఏం మాట్లాడినా దాని వెనుక ఏదో వుంటుంది. అన్నట్టు, రవితేజతో సినిమా ప్లాన్ చేస్తున్నాడు కదా?  

'జై బోలో తెలంగాణా' పూర్తయింది

 
 
 
 
        తెలంగాణా ఉధ్యమం నేపధ్యంలో ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్ రూపొందిస్తున్న 'జై బోలో తెలంగాణా' చిత్రం షూటింగ్ పూర్తవుతున్న సందర్భంగా ఈరోజు (డిసెంబర్ 28 ) హైదరాబాదులో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా దర్శకుడు శంకర్ మాట్లాడుతూ, "అందరి సహకారంతో రేపటితో షూటింగ్ పూర్తవుతోంది. మిగతా కార్యక్రమాలు కూడా పూర్తి చేసి, జనవరి మొదటి లేదా రెండో వారంలో చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసాం" అన్నారు. దేశపతి శ్రీనివాస్ చెబుతూ, రైతు సమస్యలపై చిత్రాలు వచ్చాయి కానీ, ఒక ఉద్యమం పై ఇంతవరకు సినిమాలు రాలేదు. ఇది తొలి చిత్రమవుతుంది. ఉధ్యమంలో పాల్గొన్నవారే ఈ చిత్రంలో నటించడం విశేషం" అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా జూలూరి గౌరీశంకర్, మల్లేపల్లి లక్ష్మయ్య, అల్లం నారాయణ, చీవీయాల్ తదితరులు పాల్గొన్నారు.

జనవరి 12 న 'మిరపకాయ్'

 
 
 
 
          రవితేజ హీరోగా రిచా గంగోపాధ్యాయ, దీక్షా సేథ్ హీరోయిన్లుగా రూపొందుతున్న 'మిరపకాయ్' చిత్రాన్ని జనవరి 12 న విడుదల చేస్తున్నట్టు చిత్ర నిర్మాత రమేష్ పుప్పాల హైదరాబాదులో ప్రెస్ కి తెలిపారు. ఎల్లో ఫ్లవర్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా దీనిని రూపొందించామనీ, ఇటీవల విడుదలైన ఆడియో మంచి హిట్ అయిందనీ నిర్మాత చెప్పారు. రవితేజ పెర్ఫార్మెన్స్, హరీష్ టేకింగ్, తమన్ సంగీతం చిత్రాన్ని హిట్ చిత్రంగా నిలుపుతాయని ఆయన తెలిపారు. 

రామోజీరావుతో బంధం ఈనాటిది కాదంటోన్న దాసరి

 
 
 
           ఒకప్పుడు 'ఈనాడు' రామోజీరావుకి, దర్శకుడు దాసరి నారాయణరావుకి మధ్య ఒక విధమైన పోటీ వుండేది. ఆ సమయంలో ఇద్దరి మధ్య మనస్పర్ధలు కూడా వచ్చాయి. ఇది తెలుగువారందరికీ తెలిసిందే. అయితే, గత కొంత కాలంగా వారి మధ్య మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. ఇద్దరూ తరచూ కలుసుకోవడం కూడా జరుగుతోంది. కాగా, దాసరి నిర్మిస్తున్న 'ప్రేమాభిషేకం' మెగా సీరియల్ ను ఈటీవీలో ప్రసారం చేస్తున్నారు. దీనికి మంచి ప్రేక్షకాదరణ కూడా లభించి, మంచి రేటింగ్ వచ్చింది. ఇప్పుడీ సీరియల్ 600 ఎపిసోడ్ ల ప్రసారాన్ని పూర్తిచేసుకుంది. ఈ నేపధ్యంలో ఈరోజు (డిసెంబర్ 28 ) హైదరాబాదులో దాసరి ఆఫీసులో ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసారు.
          ఈ సందర్భంగా దాసరి మాట్లాడుతూ, "ముందుగా ఈ సీరియల్ ను ఈటీవీలో ఇన్నాళ్లుగా ప్రసారం చేస్తున్న రామోజీరావు గారికి థాంక్స్ చెపుతున్నాను. ఆయనకు, నాకు మధ్య ఎప్పటి నుంచో మంచి అనుబంధం వుంది. నా 'తూర్పు-పడమర' చిత్రం షూటింగు వారింట్లో పదిహేను రోజులపాటు చేసాను. అయితే, మధ్యలో కాస్త గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మా బంధం మళ్లీ  ఎంతో గట్టిపడింది. పొతే, మా ఆవిడకు సీరియల్స్ అంటే ఎంతో ఇష్టం. తన కోసమే ఈ సీరియల్స్ నిర్మిస్తున్నాను. సీరియల్ ప్రారంభించడమే మన  చేతిలో వుంటుంది. ముగింపు మన చేతిలో వుండదు. 'ప్రేమాభిషేకం' ప్రారంభమై మూడేళ్లయింది. 'ప్రేమాభిషేకం' సినిమాకు చేసినట్టుగా దీనికి కూడా సిల్వర్ జూబిలీ ఘనంగా చేస్తాను" అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా ఈటీవీ డైరెక్టర్ బాపినీడు, అజయ్ శాంతి, కొమ్మనాపల్లి గణపతిరావు తదితరులు పాల్గొన్నారు.  

సమీరారెడ్డికి పెళ్లికొడుకు కావాలట

            అటు బాలీవుడ్ లో కానీ, ఇటు సౌత్ లో కానీ హీరోయిన్ గా  సక్సెస్ కాలేకపోవడంతో ముద్దుగుమ్మ సమీరా రెడ్డి ఇక సినిమాలకి స్వస్తి చెప్పాలనుకుంటోంది. అంటే, ఇక పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అవ్వాలనుకుంటోంది. దీని గురించి సమీరా చెబుతూ, "వచ్చే ఏడాదే పెళ్లి చేసుకోబోతున్నాను" అంది. అప్పుడే పెళ్లా? అనడిగితే, "ఇంట్లో పెళ్లి గురించి అడుగుతుంటే, 2011 లో చేసుకుంటానని రెడ్డి గారికి అంటే మా డాడీకి ప్రామిస్ చేసాను. మరి అది నిలబెట్టుకోవాలి కదా?" అంది నవ్వుతూ. 'మరి మీ దృష్టిలో మిస్టర్ రైట్ ఎవరైనా వున్నారా?' అంటే, "ఊహూ.. అతనికోసమే వెతుకుతున్నాను. ఇంకా ఎవరూ తారసపడలేదు. మీకు తెలిసున్న మంచి కుర్రాడు వుంటే చెప్పండి" అంటూ ఆ పని మనకే పురమాయిస్తోంది.

అనుష్క అమాయకురాలు కాదు కదా?

 

 
 
            బాలీవుడ్ లో నటించే అవకాశం వస్తే ఎవరైనా వదులుకుంటారా? ఎవరూ వదులుకోరు కదా... ఎందుకంటే, ఆర్టిస్టులకి బాలీవుడ్ అన్నది ఒక స్వప్నం. అయితే, అందాల అనుష్క మాత్రం చాలా తేలికగా తీసి పారేసింది బాలీవుడ్ ఆఫర్ ని. ఆమధ్య అనుష్క తమిళంలో చేసిన 'సింగం' చిత్రం పెద్ద హిట్ అయింది. ఆ సినిమాని ఇప్పుడు హిందీలో రీమేక్ చేస్తున్నారు. అక్కడ కూడా అనుష్కనే హీరోయిన్ గా తీసుకోవాలని ఆమెను అడిగారట. అయితే, అను ఆ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించిందట. "ప్రస్తుతం సౌత్ లో నాకు ఏ సమస్యా లేదు. హ్యాపీగా వున్నాను. పైగా తెలుగు, తమిళ భాషల్లో బిజీగా వున్నాను. ఈ టైం లో దీనిని డిస్టర్బ్ చేసుకోవడం ఎందుకు?" అంటోంది అను. అయితే, అసలు కారణం వేరే వుంది. ఇక్కడ నుంచి బాలీవుడ్ వెళ్లిన ఆశిన్, త్రిష, ప్రియమణి లాంటి వాళ్లు అక్కడ సక్సెస్ కాలేకపోయారు. మళ్లీ ఇక్కడికే వస్తున్నారు. బాలీవుడ్ లో సక్సెస్ కావడం అంత ఈజీ కాదన్న విషయం అనుకి బాగా తెలుసు. ఇవన్నీ ఆలోచించే ఆమె తెలివైన నిర్ణయం తీసుకుంది అంటున్నారు.

మళ్లీ అలరించనున్న మాధుర్యం


 
 
 
 
           'మాధురీ దీక్షిత్ ని మాకిచ్చేసి, కాశ్మీర్ ని మీరుంచేసుకోండి'  అన్నాడట ఒక పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్ ఓ పార్టీలో. కాశ్మీర్ ని వదులుకోవడానికి కలలో కూడా అంగీకరించని పాకిస్తానీలు... అందునా ఓ మిలటరీ ఆఫీసర్ అలా అన్నాడంటే మాధురి అందం వాళ్లని ఎంతెలా కట్టిపారేసిందో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇది కొన్నేళ్ల క్రితం బాగా పాప్యులర్ అయిన జోక్ లాంటి వార్త. అందులో నిజమెంతుందో మనకు తెలియదు కానీ,  మాధురీకి అంతకు కావలసిన కాంప్లిమెంట్ ఇంకేం కావాలి? కొన్నేళ్ల క్రితం పెళ్లి చేసుకుని యూఎస్ వెళ్లిపోయిన ఈ మాధుర్యం మళ్లీ ప్రేక్షకుల్ని అలరించనుంది. 'ఫ్రీకీ ఫ్రైడే' అనే హాలీవుడ్ సినిమా ఆధారంగా తను తీయబోయే హిందీ సినిమాలో ఆమెను నటింపజేయడానికి నటుడు అనిల్ కపూర్ ప్రయత్నిస్తున్నాడు. మొన్న మాధురీని కలిసి రెండు గంటలపాటు ఈ సినిమా గురించి ఆమెతో డిస్కస్ చేసాడు. ఆమె కూడా ఏ ప్రాజక్ట్ పట్ల ఆసక్తి చూపుతోంది. సో... త్వరలో మళ్లీ మాధురీని మనం తెరపై చూడచ్చన్న మాట.

'ఆటోనగర్ సూర్య' లో హీరో బాలకృష్ణ కాదా?

 
 
 
        ఆ మధ్య 'ప్రస్థానం' వంటి వైవిధ్యభరిత చిత్రాన్ని రూపొందించి, విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న దర్శకుడు దేవా కట్ట తాజాగా తన తదుపరి చిత్రానికి 'ఆటోనగర్ సూర్య' అన్న టైటిల్ ని పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన కధను ఆయన అప్పుడే సిద్ధం చేసుకున్నారు కూడా. విజయవాడ గ్యాంగ్ వార్ ల నేపధ్యంలో ఈ చిత్రం రూపొందుతుందని తెలుస్తోంది. ఇందులో ప్రముఖ నటుడు బాలకృష్ణ కధానాయకుడుగా నటించనున్నారని వార్తలు కూడా వచ్చాయి. అయితే, ఈ చిత్రంలో ఆయన నటించడం లేదట. ఈ విషయాన్ని దేవా స్వయంగా వెల్లడించారు. "బాలయ్య బాబు కాదు ఇందులో హీరో. ఎవరనేది త్వరలో చెబుతాను. అయితే, బాలయ్య బాబుతో చేయడాన్ని ఒక గౌరవంగా భావిస్తాను. ఆ అవకాశం త్వరలోనే వస్తుందని ఆశిస్తాను" అంటున్నాడు దేవా. సో... ఈ ప్రాజక్టులో హీరో ఎవరనేది త్వరలోనే తెలుస్తుంది.  

నాగార్జునకి బ్రహ్మానందం వడ్డన

 
 
 
            హాస్యనటుడు బ్రహ్మానందంకి  సినిమా ఇండస్ట్రీ ఆఖరికి 'అన్నదాత' బిరుదుని ఇచ్చేస్తుందేమో! ఎందుకంటే, ఇంట్లో భార్య చేత రకరకాల వంటకాలు వండించి  తీసుకెళ్లి తన సహచర నటీనటులకి కొసరి కొసరి వడ్డిస్తున్నాడట. మొన్నా మధ్య రామ్ చరణ్ తేజ కూడా 'బ్రహ్మానందం అంకుల్ తెచ్చిన లంచ్ సూపర్ గా ఉంద'న్నాడు. ఇప్పుడు నాగార్జున కూడా అదే అంటున్నాడు. "షూటింగ్ టైం లో బ్రహ్మానందం పొద్దున్నే ఫోన్ చేస్తాడు, ఈరోజు మీకు కెరియర్ తెస్తానంటూ. ఇక తెచ్చాక లంచ్ టైం లో వడ్డించడం మొదలెడతాడు. అన్నం, కూరలు వద్దంటున్నా కూడా ఎక్కువగా పెట్టేస్తాడు. ఇక నెయ్యి కూడా పోస్తూనే ఉంటాడు. 'వద్దు బాబూ' అన్నా ఊరుకోడు. రోజూ డైటింగ్ చేసే నేను అలా ఒక్కోసారి బాగా లాగించేస్తుంటాను" అంటూ తాజాగా ఓ టీవీ ఇంటర్వ్యులో చెప్పుకొచ్చాడు. ఇలా బ్రహ్మానందం తన రుచికరమైన వంటకాలతో అందర్నీ బుట్టలో వేసేసుకుంటున్నాడన్న మాట.  

హీరోగా వస్తున్న విలన్

 
 
 
           అవకాశం వస్తే ఎవరైనా సరే హీరోగా యాక్ట్ చేయడానికి రెడీ అంటారు. ఎందుకంటే, ఏ ఆర్టిస్టుకైనా తమ కెరీర్ లో అదే అల్టిమేట్ కాబట్టి. అందుకే కమెడియన్లు కానీ, క్యారక్టర్ ఆర్టిస్టులు కానీ అటువంటి ఆఫర్ వస్తే వదలరు. ఇప్పుడు విలన్ పాత్రలు వేసే సుబ్బరాజు కూడా ఆ పనిలోనే వున్నాడు. 'అజ్ఞాతం' పేరుతో రూపొందుతున్న ఓ చిత్రంలో కధానాయకుడిగా నటిస్తూ, తనూ హీరోననిపించుకుంటున్నాడు. పోకూరు శ్రీధర్ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ చిత్రం టాకీ పార్ట్ కూడా అప్పుడే సగం పూర్తయింది. జనవరి లో మొదలయ్యే చివరి షెడ్యులుతో షూటింగ్ మొత్తం పూర్తవుతుందని దర్శకుడు చెబుతున్నాడు. బెంగాలీ అమ్మాయి దీప్తిప్రియ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఒకవేళ ఈ సినిమా అటు ఇటు అయినా కూడా సుబ్బరాజుకేమే కాదు. అతని పాత్రలు అతనికెలాగూ వుంటాయి!   
Related Posts Plugin for WordPress, Blogger...