e-cigarette review Ping Yahoo GOSSIPS: 2011

Wednesday, December 14, 2011

మూడు పడవల ప్రయాణం చేస్తున్న తాప్సీ

ఇటీవల వచ్చిన 'మొగుడు' సినిమా ఫ్లాప్ అయినా, సొట్టబుగ్గల చిన్నది తాప్సీకి మాత్రం ఆఫర్లు ఫర్వాలేదనే స్థాయిలోనే వస్తున్నాయి. ప్రస్తుతం తను ఏకకాలంలో మూడు భాషల్లో నటిస్తూ బిజీగానే వుంది. తెలుగులో రవితేజ పక్కన ఓ సినిమాలో నటిస్తున్న తాప్సీ, హిందీలో ప్రముఖ దర్శకుడు డేవిడ్ ధావన్ డైరెక్షన్లో 'చష్మే బద్దూర్' అనే రొమాంటిక్ కామెడీలో నటిస్తోంది. ఇక తమిళంలో ఇప్పటికే 'ఆడుగలం', 'వందాన్ వెండ్రాన్' చిత్రాలలో నటించింది. తాజాగా మరో తెలుగు, తమిళ భాషల్లో రూపొందే ద్విభాషా చిత్రాన్ని అంగీకరించినట్టు తెలుస్తోంది. లక్ష్మీప్రసన్న నిర్మించే 'గుండెల్లో గోదారి' సినిమాలో ఆది పినిశెట్టి సరసన ఆమె కథానాయికగా ఎంపికైంది. ఇళయరాజా సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రం ద్వారా కుమార్ దర్శకుడుగా పరిచయమవుతున్నాడు. ఇందులో లక్ష్మీప్రసన్న కూడా ఓ కీలక పాత్ర పోషిస్తుంది.

Tuesday, July 5, 2011

SADA PHOTO GALLERY


సల్మాన్ పడక గదికి వెళ్లాలనివుంది: సమీరా రెడ్డి

టాలీవుడ్, బాలీవుడ్ చిత్ర సీమల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టుకున్న ముద్దుగుమ్మ సమీరా రెడ్డి. ఆమె సల్మాన్ ఖాన్‌పై మనస్సు పారేసుకుంది. ఖాన్ పట్ల పిచ్చి ప్రేమను చూపుతోంది. ఏకంగా సల్మాన్ ఖాన్ పడక గదిలో గడపాలని బహిరంగానే తన మనస్సులోని మాటను వెల్లడించింది.

ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించాయి. ఆమె తాజాగా మీడియాతో మాట్లాడుతూ తాను స్లీప్ వాక్ చేస్తూ సల్మాన్‌ఖాన్ బెడ్ రూంలోకి వెళ్ళాలని ఉందని చెప్పుకొచ్చింది. సల్మాన్ అంటే తనకు ఎనలేని ప్రేమ ఉందన్నారు. అయితే, సమీరా ఈ తరహా వ్యాఖ్యలు చేయడంలో పరమార్థం లేకపోలేదు.

బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్‌ది గోల్డెన్ హ్యాండ్‌గా ఉంది. సల్మాన్‌కు వయస్సు మీదపడుతున్నా... అతనితో జత కట్టేందుకు, బెడ్ రూమ్‌లోకి దూరాలనే ఆలోచనతో ఉండే హీరోయిన్ల జాబితా పెరిగిపోతోంది.

అందుకు ఉదాహరణగా అసిన్‌ను చెప్పుకోవచ్చు. చిత్ర పరిశ్రమకు దూరమవుతుందని అనుకుంటున్న తరుణంలో సల్మాన్‌తో జతకట్టి మళ్లీ గాడిన పడింది. అలాగే, "దబాంగ్" హీరోయిన్ సోనాక్షి సిన్హా కూడా ఇలా సల్మాన్ నమ్ముకుని ఎదగటాన్ని పట్టుగొమ్మగా ఉపయోగించుకుంటోంది.

Saturday, May 21, 2011

పొగడ్తలతో ఇబ్బందుల్లో పడ్డ తార


బాలీవుడ్ కథానాయిక కరీనాకపూర్ కి లౌక్యం తెలియదా? తెలియదనే అంటున్నారిప్పుడు. లేకపోతే అలా ఒకర్ని పొగిడితే మరొకరికి కోపం వస్తుందన్న విషయం తెలియకపోతే ఎలా? అని కూడా అంటున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే, ఆమధ్య మలయాళంలో వచ్చిన 'బాడీగార్డ్' సినిమాని ప్రస్తుతం హిందీలో కూడా రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా చేసే ముందు అందులో హీరోయిన్ గా నటిస్తున్న కరీనాని నయనతార నటించిన మలయాళం వెర్షన్ తో బాటు, అసిన్ నటించిన తమిళ వెర్షన్ కూడా చూడమని దర్శకుడు సిద్ధిక్ సూచించాడట.
               చూశాక తన అభిప్రాయం అడిగితే, అసిన్ కన్నా నయనతార బాగా నటించిందని కరీనా కామెంట్ చేసింది. ఇప్పుడిదే పెద్ద కాంట్రావార్సీ అయి కూర్చుంది. కరీనా కామెంట్స్ విన్న అసిన్ ఇప్పుడు కరీనాపై మండిపడుతోంది. "నా నటనకి ఒకరు సర్టిఫికేట్ ఇవ్వక్కర్లేదు. నేనేమిటో బాలీవుడ్ లో అందరికీ తెలుసు. ఎవరి పని వాళ్లు చేసుకుంటే బాగుంటుంది" అంటూ కరీనాకి చురకంటించింది. దీంతో, అనవసరంగా నయనతారని పొగిడి ఇబ్బందుల్లోపడ్డానే..  అని కరీనా ఇప్పుడు ఫీలవుతోందట!
 


మలేసియా వెళ్ళొచ్చిన మెగాస్టార్ మేనల్లుడు

చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ని కథానాయకుడిగా పరిచయం చేస్తూ ప్రముఖ దర్శకుడు వై.వి.యస్.చౌదరి 'రేయ్' పేరుతో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తొలి షెడ్యులు షూటింగ్ మార్చ్ 26 నుంచి ఏప్రిల్ 26 వరకు మలేసియాలో జరిగింది. ముఖ్యమైన సన్నివేశాలతో పాటు యాక్షన్ సీన్స్ ను కూడా అక్కడ షూట్ చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చి ప్రస్తుతం హైదరాబాదులో షూటింగ్ కొనసాగిస్తున్నారు. వచ్చే నెల 10 నుంచి అమెరికాలో షూటింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
                   కథ ప్రకారం ఫస్టాఫ్ వెస్ట్ ఇండీస్ లోనూ, సెకండాఫ్ అమెరికాలోనూ జరుగుతుంది. అందుకే ఆయా ప్రాంతాలలో షూటింగ్ చేస్తున్నారు. మ్యూజికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా లవ్ స్టోరీగా రూపొందుతోందని దర్శకుడు చౌదరి చెబుతున్నారు. 'షౌట్ ఫర్ సక్సెస్' అన్నది ఈ సినిమాకి ట్యాగ్ లైన్ గా పెట్టారు. శుభ్ర అయ్యప్ప కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్టు చౌదరి చెప్పారు. తమ 'బొమ్మరిల్లు వారి' బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

'ఆ పట్టింపులు' లేవంటున్న ముద్దుగుమ్మ

అవసరమైతే బికినీ ధరించడానికి రెడీ... అనే స్టేట్ మెంట్ ఇస్తున్న కథానాయికలలో తాజాగా పూర్ణ కూడా చేరింది. ఇటీవల విడుదలైన 'సీమటపాకాయ్' సినిమా ద్వారా పూర్ణ కథానాయికగా పరిచయమైంది. ఈ సినిమా విజయపథంలో పయనిస్తున్న నేపథ్యంలో, గ్లామర్ విషయంలో తనకు పట్టింపులు లేవని చెపుతోంది. "గ్లామర్ లేనిదే సినిమా లేదు. అలాంటప్పుడు మడికట్టుకుని కూర్చుంటామంటే ఎలా?" అంటోంది. అన్నట్టు, కేరళ కుట్టి అశిన్ పోలికలు ఈ పూర్ణలో బాగా వుంటాయి. అందుకే అంతా ఇప్పుడీమెను అశిన్ తో పోలుస్తున్నారు కూడా. దీనికి తను తెగ సంబరపడిపోతోంది.
                  "అశిన్ లాంటి మంచి నటి, అందగత్తెతో నన్ను పోల్చడం చాలా హ్యాపీగా వుంది. అయితే, నన్ను నన్నుగానే చూడండి. సీమటపాకాయ్ తర్వాత మంచి ఆఫర్లు వస్తున్నాయి. త్వరలోనే వాటి వివరాలు చెబుతాను" అంటోంది పూర్ణ. ఒక సినిమా చేసిందో లేదో...  అప్పుడే తను తెలుగులో కూడా మాట్లాడేస్తోంది. మరో రెండు మూడు సినిమాలు చేస్తే తన డబ్బింగ్ తానే చెప్పుకుంటానని కూడా చెబుతోంది.

విజయ్ హీరోగా మణిరత్నం కమర్షియల్ సినిమా

భారీ చారిత్రాత్మక కథా చిత్ర నిర్మాణాన్ని డ్రాప్ చేసుకున్నాక దర్శకుడు మణిరత్నం ప్రస్తుతం మూడు సబ్జెక్టులపై వర్క్ చేసున్నాడట. వీటిలో ఒకటి యాక్షన్ ప్రధానంగా సాగే కమర్షియల్ చిత్రం. ముందుగా ఈ చిత్రాన్నే డైరెక్ట్ చేయాలని మణి నిర్ణయించుకుని, ఆ ప్రకారం వర్క్ చేస్తున్నాడని కోలీవుడ్ సమాచారం. ఇందులో విజయ్ కథానాయకుడుగా నటిస్తాడని అంటున్నారు. అందుకే, హిస్టారికల్ సినిమాని డ్రాప్ చేసుకున్నాక దాని కోసం బుక్ చేసుకున్న మహేష్ బాబు, ఆర్య, అనుష్కల డేట్స్ కేన్సిల్ చేసి, విజయ్ డేట్స్ ను మాత్రం వుంచుకున్నాడు. విజయ్ కూడా కమర్షియల్ హీరో కావడంతో ప్రస్తుతం అనుకుంటున్న సబ్జెక్ట్ కి అతను సరిగ్గా సూట్ అవుతాడని మణి భావిస్తున్నాడట. 

నటనకు గుడ్ బై చెప్పనున్న మల్లూ బేబీ

ఏ భాషలోనూ కూడా సినిమాలు లేకపోవడం ఓపక్క, వయసు ముదిరిపోతూ వుండడం మరోపక్క ఇప్పుడు కేరళ కుట్టి మీరా జాస్మిన్ ని బాధిస్తోంది. దాంతో ఇక నటనకు స్వస్తి చెప్పాలని భావిస్తోందట. తమిళ డబ్బింగ్ సినిమా 'రన్' తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, ఆ తర్వాత పవన్ కల్యాణ్, రవితేజ, బాలకృష్ణ, జగపతిబాబు వంటి పెద్ద తారలతో సినిమాలు చేసినప్పటికీ, మీరాకు తెలుగులో సుడి తిరగలేదు. ఇతర భాషల్లో కూడా పరిస్థితి అలాగే ఉండడంతో ఇక నటనకు గుడ్ బై చెప్పేసి, పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడే ఆలోచనలో వున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తను ప్రముఖ మాండిలిన్ విద్వాంసుడు మాండిలిన్ శ్రీనివాస్ సోదరుడు రాజేష్ ప్రేమలో పడింది.  త్వరలో అతనిని వివాహం చేసుకుంటుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

'వీడు తేడా' అంటున్న నిఖిల్

నిఖిల్, పూజా బోస్ జంటగా చిన్నికృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'వీడు తేడా'. లక్ష్మీ నరసింహా ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ప్రకాష్, కళ్యాణ్ చక్రవర్తి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ శివారులోని  మణికొండలో జరుగుతోంది. నిఖిల్ గతి చిత్రాలకు భిన్నంగా ఉండే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని దర్శకుడు చిన్నికృష్ణ చెబుతున్నారు. చక్రి సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా ఆడియోను జూన్ నెలాఖరులో విడుదల చేయనున్నారు. 'కొత్త బంగారులోకం', 'అదుర్స్' చిత్రాల్లో వచ్చీరాని ఇంగ్లీషు మాట్లాడుతూ అలరించిన ఆర్టిస్టే ఈ చిత్ర దర్శకుడు! దీనిని జులైలో రిలీజ్ చేయడానికి రెడీ చేస్తున్నారు. 'కళవర్ కింగ్', 'ఆలస్యం...అమృతం' చిత్రాలతో వరుస పరాజయాలు చవి చూస్తున్న నిఖిల్, ఈ సినిమా మీదే ఇప్పుడు ఆశలన్నీ పెట్టుకున్నాడు!

విక్రం, అనుష్కల సినిమా 'నాన్న'


అందాల అనుష్క తాజాగా నటించిన తమిళ చిత్రం 'దైవ తిరుమగన్'. ఇందులో విక్రం కథానాయకుడిగా నటించాడు. దీనిని 'నాన్న' పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. విజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విక్రం వికలాంగుడి పాత్రలో అద్బుతంగా నటించాడంటున్నారు. ఇందులో అనుష్క లాయర్ పాత్ర పోషించింది. విభిన్న కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా విక్రం కెరీర్లో మరో మైలురాయిగా నిలుస్తుందని టాక్. ఈ సినిమా ఆడియోను రేపు (మే 21) హైదరాబాదులోని ప్రసాద్ లాబ్స్ లో రిలీజ్ చేస్తున్నారు. శివపుత్రుడు, అపరిచితుడు....  చిత్రాల స్థాయిలో 'నాన్న' సినిమా కూడా హిట్ అవుతుందేమో చూడాలి!
 


హిందీలో రీమేక్ కానున్న మరో తెలుగు చిత్రం

ప్రభాస్ కథానాయకుడిగా దిల్ రాజ్ నిర్మించిన 'మిస్టర్ పెర్ ఫెక్ట్' సినిమా సక్సెస్ అయిన నేపథ్యంలో, ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం బాలీవుడ్ రీమేక్ హక్కులను తాజాగా ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాడ్ వాలా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి హిందీలో ఎవరు దర్శకత్వం వహిస్తారన్నది ఇంకా ఖరారు కాకపోయినప్పటికీ, దర్శకుడు అనీజ్ బజ్మీతో సాజిద్ సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. గతంలో పలు ప్రాంతీయ భాషా చిత్రాలను హిందీలోకి రీమేక్ చేసిన అనుభవం అనీజ్ కు వుంది. ఏది ఏమైనా, ఇటీవలి కాలంలో పోకిరీ, కిక్, రెడీ, విక్రమార్కుడు... వంటి పలు తెలుగు చిత్రాలు హిందీలోకి రీమేక్ అయ్యాయి. ఇప్పుడు 'మిస్టర్ పెర్ ఫెక్ట్' కూడా ఆ కోవలో చేరుతోంది.

ఈరోజు యన్టీఆర్ 'స్పెషల్ బర్త్ డే'!

సింహం కడుపున సింహమే పుడుతుంది... పులి కడుపున పులే పుడుతుంది... నటుడి వంశంలో నటులే పుడతారు. అందుకు జూనియర్ యన్టీఆర్ నిలువెత్తు నిదర్శనం. మహానటుడు యన్టీఆర్ కి... తాతకు తగ్గా మనవడిగా రాణిస్తున్న ఈ యువకిశోరం జన్మదినం నేడు. అయితే, నేటి పుట్టిన రోజుకి ఓ ప్రత్యేకత వుంది. లక్ష్మీ ప్రణతిని ఇటీవలే మనువాడి ఓ ఇంటివాడైన యన్టీఆర్ జంటగా జరుపుకుంటున్న జన్మదినం ఇది. అమ్మానాన్నలతో బాటు అర్ధాంగి, అత్తామామలు తోడుగా జరుపుకుంటున్న తొలి వేడుక ఇది. వీరందరి సమక్షంలో నేడు ఈ యంగ్ టైగర్ బర్త్ డే కేక్ ను కట్ చేస్తున్నాడు.
                   కెరీర్ పరంగా యన్టీఆర్ వయసు కేవలం పదేళ్లు. ఇంతవరకు చేసిన సినిమాలు జస్ట్ పందొమ్మిది. అయితే సంపాదించుకున్న ఇమేజ్ మాత్రం అంతాఇంతా కాదు... వంద సినిమాల ఇమేజ్! ఈ ఇమేజ్, ఫాలోయింగ్ ఈ నందమూరి అందగాడికి అంత ఈజీగా వచ్చేసింది కాదు. ఇంటి పేరు, తాత రూపు ఇనిషియాల్ గా ఓ ఫ్లాట్ ఫారాన్ని ఏర్పరిస్తే... మిగతాదంతా అతని కష్టార్జితం. డ్యాన్సుల్లో గానీ, యాక్షన్ సీన్స్ లో కానీ అతను పడే కష్టం, తపన, తాపత్రయం అతన్నీవేళ ఈ స్థాయిలో నిలబెట్టాయి. ఆ కష్టమే అతనికి శ్రీరామరక్షగా నిలుస్తుంది. ముందు ముందు మరిన్ని విజయాలకు తోడ్కునిపోతుంది.
                   ఈ జన్మదినం శుభ సందర్భంగా యన్టీఆర్ కు ap7am.com మెనీ హ్యాపీ రిటర్న్స్ చెబుతోంది. 

Monday, April 25, 2011

మరో 'బొమ్మరిల్లు' తీస్తున్న దిల్ రాజు?

సిద్ధార్థ్ హీరోగా భాస్కర్‌ దర్శకత్వంలో గతంలో వచ్చిన ‘బొమ్మరిల్లు’ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. అంతేకాదు, నిర్మాత 'దిల్' రాజు బ్యానర్‌ వాల్యూను కూడా మరింత పెంచిందని చెప్పచ్చు. దానికి కారణం, మంచి కుటుంబకథను చక్కని స్క్రీన్ ప్లే తో చెప్పడమే! అందుకే, దిల్ రాజు ఇప్పుడు మళ్లీ సిద్ధార్థ్ తో తీస్తున్న 'ఓ మై ఫ్రెండ్' సినిమాకు కూడా ఫేమిలీ డ్రామాతో కూడిన కథనే ఎంచుకున్నాడని అంటున్నారు. ఈ సినిమా ద్వారా వేణు శ్రీరాం దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాలో సిద్ధార్థ్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, నవదీప్, హన్సిక మరో జంటగా నటిస్తున్నారు.

సంగీత దర్శకురాలిగా కౌసల్య

చక్రి సంగీత దర్శకత్వంలోనే ఎక్కువగా పాటలు పాడే ప్రముఖ గాయని కౌసల్య కూడా ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అవుతోంది. నూతన దర్శకురాలు హేమారెడ్డి రూపొందించే ఓ చిత్రానికి ఆమె సంగీతాన్ని సమకూరుస్తోంది. గతంలో పలువురు ప్రముఖ దర్శకుల వద్ద పని చేసిన హేమారెడ్డి ఈ చిత్రాన్ని నూతన తారలతో రూపొందిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఆర్టిస్టుల టాలెంట్ సెర్చ్ కార్యక్రమం హైదరాబాదులోని బిగ్ బజార్ షాపింగ్ మాల్ లో ప్రారంభమైంది. బిగ్ బజార్ లో షాపింగ్ చేసిన వారికి ఇందులో నటించే అవకాశం దొరుకుతుందని నిర్వాహకులు తెలిపారు.

సమీరా రెడ్డికి ఇంతలోనే ఏమైంది?

ఏమిటో సమీరారెడ్డికి ఉన్నట్టుండి ఒక్కసారిగా వైరాగ్యం పట్టేసుకుందిప్పుడు. అవును... 'అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలి? చేసుకోకుండా వుండలేమా? నాకైతే పెళ్లి చేసుకోవాలని లేదు. సింగిల్ గానే ఉండాలనుకుంటున్నాను' అంటూ తాజాగా ఓ స్టేట్ మెంట్ ఇచ్చింది. దాంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు, ఇంతలోనే అమ్మడికి ఏమైందంటూ!
                అసలు విషయం ఏమిటంటే, ఈమధ్య తన స్నేహితురాలి పెళ్లి ఏర్పాట్లన్నీ దగ్గరుండి తనే చూసిందట. దాంతో ఈ పెళ్లి తంతు మీద చిరాకు, విసుగు వచ్చేశాయట.  దానికి తోడు, పెళ్లి అనే బంధంతో ఒకరికి భారం అవడం, మరొకరు మనకి బరువవడం తనకిష్టం లేదట. అందుకే పెళ్లికి దూరంగా వుండాలనుకుంటున్నట్టు చెబుతోంది. పెళ్లీడుకొచ్చిన పిల్ల ఇలా మాట్లాడడంతో, సమీరా ఎక్కడో దెబ్బతినే ఉంటుందని బాలీవుడ్ లో కామెంట్లు వినపడుతున్నాయి.     

'బద్రీనాథ్' కి మూడు పాటలు బ్యాలెన్స్

అల్లు అర్జున కథానాయకుడుగా వి.వి.వినాయక్ డైరెక్షన్ లో గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ నిర్మిస్తున్న భారీ చిత్రం 'బద్రినాథ్' షూటింగుకు సంబంధించి ఇక మూడు పాటలు మాత్రం మిగిలి వున్నాయి. వీటిని వచ్చే నెలలో చిత్రీకరిస్తారు. ఇదిలా ఉంచితే, మరోపక్క చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వేగంగా జరుగుతోంది. అలాగే, ప్యాచ్ వర్క్ షూటింగ్  ఈ వారంలో పూర్తి చేస్తారు. అల్లు అర్జున్ ఇండియన్ సమురాయ్ గా నటిస్తున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో నిర్మాణం జరుపుకుంటున్న భారీ బడ్జెట్ చిత్రాలలో బద్రీనాథ్ ముందుంది. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇటీవల రూపొందిన భారీ చిత్రాలన్నీ బాక్సాఫీసు వద్ద ఫెయిలైన నేపథ్యంలో ఈ చిత్రం పట్ల టాలీవుడ్ లో ఆసక్తి నెలకొంది! జూన్ మొదటి వారంలో దీనిని రిలీజ్ చేస్తారు.

తమన్నాకి, చైతన్యకి మధ్య గొడవా?

తమన్నాకి, నాగ చైతన్యకి మధ్య ఇప్పుడు క్షణం కూడా పడటం లేదట. ఎప్పుడూ ఏదో ఒక విషయంపై పోట్లాటే. ఇద్దర్నీ ఎవరైనా చూస్తే కనుక అసలు వాళ్లెందుకు తగవులాడుకుంటున్నారో అర్ధంకాదు. ఈ విషయాన్ని తమన్నానే చెబుతోంది. అయితే...ఇది నిజజీవితంలో కాదులెండి. త్వరలో విడుదల కానున్న '100% లవ్' సినేమాలోనన్న మాట!
                   "అందులో నా పేరు మహాలక్ష్మి. తన పేరు బాలు. ప్రతి చిన్న విషయానికీ ఇద్దరం పోట్లాడుకుంటూ వుంటాం. మరోలా చెప్పాలంటే కార్టూన్ ఫిలిం 'టాం అండ్ జెర్రీ' టైపన్న మాట. మామధ్య ఇలా చిటపటలున్నా.. చూసే వాళ్లకి మాత్రం మంచి ఫన్ గా వుంటుంది" అంటోంది తమన్నా. ఈ సినిమా మే మొదటి వారంలో రిలీజ్ అవుతోంది. చాలా కాలం తర్వాత వస్తున్న తన తెలుగు చిత్రం కాబట్టి, దీని మీద చాలా హోప్స్ పెట్టుకుంది. దీంతో బాటు 'బద్రీనాథ్', 'ఊసరవెల్లి' చిత్రాలు తనని టాలీవుడ్ లో నెంబర్ వన్ స్టార్ ని చేసేస్తాయని ఆశిస్తోంది తమన్నా.

రేపటి నుంచి తిరిగి షూటింగులు

గత పద్దెనిమిది రోజులుగా టాలీవుడ్ లో జరుగుతున్న సినీ కార్మికుల సమ్మె ఓ కొలిక్కి వచ్చింది. సమ్మె విరమించి, మంగళవారం నుంచి వీరు షూటింగులలో పాల్గొంటారు. నిర్మాతలకు, ఫిలిం ఫెడరేషన్ కూ మధ్య ఈ రోజు జరిగిన చర్చలు ఫలించి, ఒప్పందం కుదిరింది. కార్మికులకు 32 శాతం మేర వేతనాలు పెంచడానికి నిర్మాతలు అంగీకరించారు. కార్మికుల సమ్మె కారణంగా ఎక్కడి షూటింగులు అక్కడే ఆగిపోయిన సంగతి తెలిసిందే.
                  ఈ విషయంపై పలుసార్లు నిర్మాతలతో చర్చలు జరిగినా, వేతనాల పెంపుపై ప్రతిష్టంభన ఏర్పడింది. తమ డిమాండ్ మేర వేతనాలు పెంచాల్సిందేనని కార్మికులు పట్టుపట్టడంతో నిర్మాతలు దిగిరాక తప్పలేదు. ఇదిలా ఉంచితే, తమను సంప్రదించకుండా నిర్మాతల మండలి ఒప్పందాలు చేసుకుంటోందని చిన్న నిర్మాతలు ఆరోపిస్తున్నారు.

రాజమౌళి సినిమాలో నితిన్

సరైన సినిమాలు లేక, సక్సెస్ అసలే లేక వెనుకపడిపోయిన నితిన్ తాజాగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో నటించే అవకాశాన్ని పొందాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో 'సై' సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు వచ్చిన ఆఫర్ మాత్రం గెస్ట్ రోల్ అని తెలుస్తోంది. ప్రభాస్ కథానాయకుడుగా రాజమౌళి రూపొందించే సినిమాలో ఓ ముఖ్య పాత్రకు నితిన్ సెలెక్ట్ అయ్యాడు. రాజమౌళి అడగ్గానే నితిన్ వెంటనే అంగీకరించినట్టు చెబుతున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్ర రావు నిర్మించనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తను రూపొందిస్తున్న 'ఈగ' సినిమా పూర్తయ్యాక ఈ చిత్రాన్ని రాజమౌళి ప్రారంభిస్తాడు.

Tuesday, April 19, 2011

రామ్ తో తమన్నా ప్రేమకథ

ప్రస్తుతం యంగ్ హీరోలలో వెనుకపడిపోయిన రామ్ ఒక హిట్ కోసం ఈమధ్య పరితపిస్తున్నాడు. ఆ ప్రయత్నంలో ప్రస్తుతం హన్సికతో 'కందిరీగ' సినిమా  చేస్తున్నాడు. దీని తర్వాత ఓ ప్రేమకథను చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఆ చిత్రానికి ప్రేమకథల స్పెషలిష్టు కరుణాకరన్ దర్శకత్వం వహిస్తాడు. ప్రస్తుతం కరుణాకరన్ దీనికి సంబంధించిన స్క్రిప్టు పనిలో బిజీగా వున్నాడు. కాగా, పరుచూరి ప్రసాద్ నిర్మించే ఈ చిత్రంలో కథానాయికగా తమన్నా ఎంపికైనట్టు తెలుస్తోంది. రెమ్యునేరేషన్ కాస్త ఎక్కువైనప్పటికీ తమన్నానే బుక్ చేయమని దర్శకుడితో బాటు హీరో రామ్ కూడా పట్టుబట్టినట్టు చెబుతున్నారు. ఈ చిత్రానికి 'మన లవ్ స్టోరీ' అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేశారట! 

యన్టీఆర్ పెళ్లిలో తెనుగు సంస్కృతి

ఈమధ్య మన సినిమా వాళ్ల ఇళ్ళల్లో పెళ్లిళ్ళన్నీ ఎక్కువగా ఉత్తరాది సంప్రదాయ పద్ధతిలో జరుగుతున్నాయి. సంగీత్, మెహందీ వంటి మన సంప్రదాయం కాని కార్యక్రమాలే ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. అయితే, 'ఇవన్నీ తన పెళ్లిలో బంద్' అంటున్నాడు యన్టీఆర్. అచ్చతెనుగు సంప్రదాయాలకు, సంస్కృతికి తన వివాహంలో పెద్దపీట వేయాలని ఆయన నిర్ణయించుకున్నాడు. ఓ తెలుగు పల్లెటూర్లో, ఓ కలవారి ఇంట జరిగే వివాహంగా తన వివాహం జరగాలని ఆయన కోరుకుంటున్నాడు.
                     అంటే, అచ్చం 'పెళ్లి పుస్తకం' సినిమాలోని 'శ్రీరస్తు...శుభమస్తు..శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం' పాటలో బాపుగారు చూపించిన పద్ధతిలో యన్టీఆర్ వివాహ వేడుక ఉంటుందన్న మాట! అందుకే, శుభలేఖతో బాటు స్వీట్లు పంచే పద్ధతిని కూడా ఆయన పెట్టుకోలేదు. సోమవారం నాడు హైదరాబాదులో సినీ ప్రముఖులు కృష్ణ, కృష్ణంరాజు, రామానాయుడు, చిరంజీవి, రాఘవేంద్రరావు, రాజమౌళి, వినాయక్ ల ఇళ్లకు వెళ్లి, పెళ్లి శుభలేఖల్ని స్వయంగా ఇచ్చి ఆహ్

ట్రాఫిక్ కానిస్టేబుల్ గా కమల హాసన్

కమల హాసన్ ఏ పాత్ర పోషించినా దానికో ప్రత్యేకత వుంటుంది. తాజాగా ఆయన పోషించబోయే పోలీస్ కానిస్టేబుల్ పాత్ర కూడా అటువంటిదే. ఇటీవల మలయాళంలో వచ్చిన 'ట్రాఫిక్' అనే సినిమా కమల్ ని బాగా ఆకట్టుకుందట. దాంతో ఆ చిత్రాన్ని తమిళ, తెలుగు భాషల్లో రీమేక్ చేసే పనిలో పడ్డాడిప్పుడు. ఇందులో తను ట్రాఫిక్ కానిస్టేబుల్ గా నటిస్తాడట. ఇదిలా ఉంచితే, సెల్వరాఘవన్ డైరెక్షన్ లో తాను నటించనున్న విశ్వరూపం సినిమా షూటింగ్ విదేశాలలో జరగాల్సి వుంది., అయితే, యూనిట్ కి వీసాలు రావడంలో జాప్యం జరుగుతోంది. దాంతో ఈలోగా ఈ కానిస్టేబుల్ సినిమాలో నటించడానికి కమల్ ప్లాన్ చేసుకుంటున్నాడని కోలీవుడ్ సమాచారం.

షకీలా పాట కూడా పాడింది!

ఒకప్పుడు శృంగార నటిగా కుర్రకారుకి నిద్రలు లేకుండా చేసిన షకీలా గుర్తుంది కదూ.... ఇప్పుడామె కొత్త అవతారం ఎత్తుతోంది. పాటకు డ్యాన్స్ చేయడమే కాదు...పాట కూడా పాడతాను.. అంటూ సిద్ధమైంది.  అయితే, ఆమె పాడింది...'షణ్ముగపురం'  అనే తమిళ సినిమాలో. ఆ పాట కూడా మాంచి హాట్ సాంగే కావడం విశేషం. "ఈ సినిమాలో ఓ మంచి పాత్ర చేస్తున్నాను. అందులో నాకో పాట వుంటుంది. దాంతో డైరెక్టర్ గారు, 'అది నువ్వే పాడితే బాగుంటుంది' అన్నారు. సరే, ఒకసారి ట్రై చేద్దాం అని పాడి చూశాను. అంతా 'చాలా బాగుంది, సూపర్' అంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చారు" అంటోంది షకీలా. అయితే, పాట పాడడం అన్నది నటించినంత ఈజీ జాబ్ కాదని చెబుతోంది షకీలా. అవకాశాలోస్తే ముందు ముందు ఇలాగే పాడుతుందట. సో... ఇక షకీలాలో రెండో కోణం చూడనున్నాం!

జెనీలియా కోరిక తీరడంలేదట!

ముంబయ్ భామ జెనీలియా ఎంత మొత్తుకున్నా, ఎన్నిసార్లు అడిగినా జాన్ అబ్రహాం మాత్రం ఆమె కోరిక తీర్చడం లేదట. ఎప్పటికప్పుడు 'నో' చెప్పేస్తున్నాడట. అసలు విషయం ఏమిటంటే, జాన్ రైడ్ చేస్తుంటే అతని బైక్ మీద కూర్చోవడానికి అంతా భయపడతారు. ఎందుకంటే, అతను వ్యోమగామిలా రేకెట్ మీద వెళుతున్నట్టు దూసుకుపోతాడు. కళ్ళు మూసి తెరిచేలోగా అదృశ్యమవుతాడు. ఒకవేళ తన బైక్ మీద ఎవరినైనా ఎక్కించుకుంటే వాళ్లకి రిస్క్ కదా... అని ఆలోచించి వెనుక సీటే తొలగించేశాడట! అయితే, జేన్నీకేమో అతని రైడ్ ని ఎంజాయ్ చేయాలన్నది చిరకాల కోరిక. దాంతో పాపం...జెన్నీ కోరిక తీరడంలేదు. ఎప్పటికైనా మళ్లీ వెనుక సీటు ఫిట్ చేయించి, తనని రైడ్ కి తీసుకువెళతాడని ఆశగా ఎదురుచూస్తోంది! 

బాలీవుడ్ కి గురిపెట్టిన ముద్దుగుమ్మ

త్వరలో బాలీవుడ్ లో పెద్ద స్టార్ ని కావడమే తన ముందున్న లక్ష్యం అంటోంది బెంగాలీ భామ శ్రద్దాదాస్. 'ఇప్పటికే అక్కడ నాలుగు సినిమాల్లో యాక్ట్ చేశాను. నాకంటూ ఓ గుర్తింపు కూడా వచ్చింది. ఇక మంచి హిట్ పడితే సెటిల్ అయిపోతాను' అంటోంది. నటనతో బాటు పాటలు కూడా పాడాలన్నది తన కోరికని చెబుతోంది. "ఆమధ్య 'సై ఆట' సినిమాలో దేవిశ్రీ నాచేత ఓ పాట పాడించారు. నా బాడీ లాంగ్వేజ్ కి సింగింగ్ కూడా బాగా సూట్ అవుతుందని చాలా మంది అంటుంటారు. అందుకే బాలీవుడ్ లో సింగర్ గా కూడా ట్రై చేస్తున్నాను" అంటోంది. తనకిక తెలుగులో ఎలాగూ అవకాశాలు రావని శ్రద్దా డిసైడ్ అయిపోయినట్టుంది. అందుకే 'బాలీవుడ్ మీదే తన దృష్టి' అంటోంది. 

నేటి వార్తలు....టూకీగా

*  కథానాయిక తాప్సీ తొలిసారిగా 'మిస్టర్ పెర్ ఫెక్ట్' సినిమాకు డబ్బింగ్ చెప్పింది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని ఈ నెల 22 న రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాత దిల్ రాజ్ చెప్పాడు.
*  వైభవ్, స్నేహ జంటగా వెంకట్ ప్రభు డైరెక్షన్ లో తమిళంలో రూపొందిన 'గోవా' సినిమాని అదే పేరుతో తెలుగులోకి డబ్ చేస్తున్నారు. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి.ఈ వారంలో పాటల్ని రిలీజ్ చేస్తారు.
*  తెలుగులో వచ్చిన 'వేదం' సినిమా తమిళ రీమేక్ అయిన 'వానం' ఈ నెల 29 న రిలీజ్ అవుతోంది. అనుష్క, శింబు, భరత్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి అక్కడ కూడా క్రిష్ దర్శకత్వం వహించాడు. 
*  నయనతార ప్రధాన పాత్రలో తన దర్శకత్వంలో త్వరలో ప్రభుదేవా ఓ చిత్రాన్ని రూపొందించనున్నాడని కోలీవుడ్ సమాచారం. మరో విశేషమేమిటంటే, ఈ చిత్రాన్ని వీరిద్దరే నిర్మిస్తారట కూడా. సంపాదించుకున్న నాలుగు డబ్బుల్నీ ప్రభుదేవా ఇలా ఖర్చుపెట్టే ప్లాన్ వేస్తున్నాడేమో!
*  ఆమధ్య పవన్ కల్యాణ్ నటించిన 'పులి' సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన శ్రియ మళ్లీ ఇప్పుడు 'కందిరీగ' సినిమాలో కూడా ఓ ఐటెం సాంగ్ చేస్తోందట.

స్నేహకు ఇప్పుడు తెలిసొచ్చిందట!

కథానాయిక స్నేహకి కాస్త లేటుగా జ్ఞానోదయం అయింది. సినిమా ఫీల్డులో వున్నప్పుడు సినిమా వాళ్లలానే ఉండాలన్న సంగతి ఇప్పుడు తెలుస్తున్నట్టుంది.  అందుకే, "గ్లామరస్ గా నటించడానికి నేను రెడీ" అంటూ ఈమధ్య తెగ స్టేట్ మెంట్లు ఇస్తోంది. ఇక్కడ సినిమా పరిభాషలో 'గ్లామరస్' అంటే కాస్త అందాలు ప్రదర్శిస్తూ కనిపించడం అన్న మాట. ఆ స్టయిల్లోనే ఫోటో సెషన్లు కూడా చేస్తోంది. పైగా, "ఈ వయసులో కాకపొతే ఇంకెప్పుడు ఎక్స్ పోజ్ చేస్తాం? నేనేమీ అమ్మమ్మ వయసులో లేను కదా?" అంటూ దీర్ఘాలు కూడా తీస్తోంది. అయినా ఆమెకు సినిమాల ఆఫర్లు మాత్రం రావడం లేదు. 'చేయవలసిన వయసులో ఎక్స్ పోజ్ చేయలేదు. ఇప్పుడు కెరీర్ అయిపోయాక చేస్తానంటే ఏం ప్రయోజనం?' అంటూ సినీ జనం కామెంట్ చేస్తున్నారు.

హైదరాబాదుకి 'రానా'? వద్దా?

రానా దగ్గుబాటిని చూస్తుంటే తను తెలుగు సినిమాలపై  కన్నా బాలీవుడ్ సినిమాలపైనే ప్రస్తుతం దృష్టి పెడుతున్నట్టు కనిపిస్తోంది. హిందీ ఫీల్డు నుంచి తన కెరీర్ కి సానుకూల సంకేతాలు ఎక్కువగా వస్తుండడంతో ముందు అక్కడే ఎదగాలనుకుంటున్నాడని తెలుస్తోంది. దానికి తోడు అక్కడ అభిషేక్, హృతిక్ రోషన్ వంటి యంగ్ బ్యాచ్ హీరోలతో ర్యాపో కూడా పెంచుకుంటున్నాడు.
                   త్వరలో విడుదల కాబోతున్న తన తొలి హిందీ చిత్రం 'దం మారో దం' ప్రమోషన్ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నాడు. ఈ విషయంలో ఈ మధ్య రాజస్థాన్, డిల్లీ, ముంబై వంటి పలు ప్రాంతాలు చుట్టివచ్చాడు. అక్కడ ప్రేక్షకుల నుంచి తనకి రెస్పాన్స్ కూడా చాలా బాగుందట. ఇవన్నీ చూస్తుంటే, ముంబై నుంచి హైదరాబాదుకి 'రానా'? వద్దా? అన్నట్టుగా అతని వ్యవహారం ఉందంటున్నారు.

బన్నీ, ఎన్టీఆర్ ల బాటలో ప్రభాస్!

బన్నీ, యన్టీఆర్ ల బాటలో ఇప్పుడు ప్రభాస్ కూడా పయనించనున్నాడు. అంటే, సినిమాల పరంగా కాదు... వాళ్లిద్దరిలా త్వరలో తనూ ఓ ఇంటి వాడు కానున్నాడు.  ఇటీవలే బన్నీ పెళ్లి చేసుకున్నాడు. యన్టీఆర్ మే 5 న చేసుకోబోతున్నాడు. వీళ్ళిద్దరిలా ప్రభాస్ కూడా ఈ సంవత్సరమే పెళ్లి పీటలు ఎక్కాలనుకుంటున్నాడు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభాస్ కి పెళ్లి సంబంధాలు చూడడం కూడా మొదలెట్టారని తెలుస్తోంది. అయితే సినిమా రంగానికి సంబంధం లేని అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని ప్రభాస్ అనుకుంటున్నాడట. తను లవ్ మేరేజ్ చేసుకోనున్నాడని మరికొన్ని వార్తలొస్తున్నాయి. మరి ఇంతకీ... తను లవ్ మేరేజ్ చేసుకుంటాడా? లేక పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకుంటాడా? అన్నది త్వరలో తెలుస్తుంది.

'కాఫీబార్' రిలీజ్ అయ్యేనా?

మన టాలీవుడ్ లో 'విషయం తక్కువ...కబుర్లు ఎక్కువ' టైపు దర్శకుల్లో గీతాకృష్ణ ముందు వరుసలో ఉంటాడు. తను తీసింది సాదాసీదా సినిమాలే అయినా, అవన్నీ ఆణిముత్యాలంటూ కబుర్లు మాత్రం మణిరత్నం రేంజ్ లో చెబుతాడు. ఇక విషయానికొస్తే, రెండున్నరేళ్ళ క్రితం 'కాఫీబార్' అనే సినిమా స్టార్ట్ చేశాడు. పూర్తి చేసి కూడా చాలా కాలమైంది. 'అదిగో రిలీజ్ ...ఇదిగో రిలీజ్' అంటూ ఎప్పటికప్పుడు స్టేట్ మెంట్లు ఇస్తున్నాడు తప్పితే, ఇంతవరకు రిలీజ్ చేయలేకపోయాడు. ఆమధ్య మార్చిలో రిలీజ్ అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఈ 22 న రిలీజ్ అంటున్నారు. ఇంతకీ, ఈసారైనా రిలీజ్ అవుతుందో, లేదో!

చంద్రబాబుని కలిసిన యన్టీఆర్


తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని ఈరోజు యువనటుడు ఎన్టీఆర్ తన తండ్రితో కలిసి వెళ్లి కలిశారు. ఈ మధ్య వీరి మధ్య వారసత్వం విషయంలో మనస్పర్థలొచ్చాయంటూ వార్తలు వెల్లువెత్తిన నేపథ్యంలో వీరు కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే, యన్టీఆర్ కల్సింది మాత్రం వీటి గురించి మాట్లాడడానికి కాదులెండి... మే 5 న జరుగనున్న తన వివాహానికి ఆహ్వానించడానికి మాత్రమే యన్టీఆర్ కలిశాడు. తన పెళ్లి శుభలేఖను ఇచ్చి చంద్రబాబు దంపతులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా పెళ్లి ఏర్పాట్ల గురించి చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. 'అప్పుడే పెళ్లి కళ వచ్చేసిందే' అంటూ యన్టీఆర్ ను సరదాగా కామెంట్ చేశారట కూడా. దానికి యన్టీఆర్ సిగ్గుతో నవ్వుకున్నాడట!
 


ఈసారైనా నిలబెట్టుకుంటాడా ?

'విక్రమార్కుడు' సినిమాలో విలన్ పాత్రలో చక్కగా నటించి గుర్తింపు తెచ్చుకున్న అజయ్, అలాగే కంటిన్యు అయివుంటే కనుక అతని కెరీర్ బాగానే వుండేది. అయితే, అత్యాశకు పోయి, తనూ హీరో అయిపోవాలనుకున్నాడు. ఆ ఆలోచనతోనే 'ఆ ఒక్కడు', 'సారాయి వీర్రాజు' సినిమాల్లో హీరోగా నటించాడు.  కానీ, ఆ ప్లాన్ బెడిసికొట్టింది. హీరోగా మాత్రం సక్సెస్ కాలేకపోయాడు. దాంతో ప్రస్తుతం చిన్న చిన్న పాత్రలు చేస్తున్న అజయ్ కి ఇప్పుడు ఓ పెద్ద ఆఫర్ వచ్చింది. పవన్ కళ్యాణ్ నటించే 'గబ్బర్ సింగ్' సినిమాలో హీరోకి సోదరుడిగా నటించనున్నాడని తెలుస్తోంది.  ఈ సినిమాకి హారీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కి బ్రదర్ గా నటించడమంటే అజయ్ కి బంపర్ ఆఫరే అనే చెప్పచ్చు. ఈ సినిమా అజయ్ కెరీర్ కి మళ్ళీ టర్నింగ్ పాయింట్ అవుతుందేమో చూడాలి!

అర్థంపర్థం లేని పొగడ్తలు

ముందు తరం నటులతో ఇప్పటి తరం నటులను పోల్చడం అనేది ఎప్పుడూ జరుగుతూనే వుంటుంది. అయితే, ఆ పోలిక కాస్త సమంజసంగా, అర్ధవంతంగా వుండాలి. అప్పుడే పోల్చిన వాళ్లకీ, పోల్చబడిన వాళ్లకీ గౌరవం. అయితే, ఇప్పుడు మన టాలీవుడ్ లో అలాంటి పోలికలేవీ లేవనే చెప్పాలి. ఎవరికిష్టమొచ్చినట్లు వాళ్లని ఎవరెవరితోనో పోల్చేస్తున్నారు. అసలు ఎవరిని ఎవరితో పోలుస్తున్నామన్న స్పృహ కూడా కొందరికి వుండదు. ఆమధ్య 'డేంజర్' సినిమా తీస్తున్న టైం లో కలర్స్ స్వాతిని 'కాసుకోండి... మరో సావిత్రి వచ్చేస్తోంది' అంటూ ఆకాశానికి ఎత్తేశాడు. ఇప్పుడు దర్శకుడు దశరథ్ కాజల్ ని సౌందర్యతో పోలుస్తున్నాడు. "మిస్టర్ పెర్ ఫెక్ట్  సినిమాలో  కాజల్ నటన సౌందర్యను మరపించేలా వుంది. భవిష్యత్తులో తెలుగుతెరకు తను మరో సౌందర్య అవుతుంది" అంటూ ఈ రోజు ప్రెస్ మీట్ లో స్తోత్రం అందుకున్నాడు దశరథ్. అది విన్న మీడియా వాళ్లు నవ్వుకున్నారు!  

దర్శకుడు జయంత్ అలిగాడట

తీన్ మార్' సినిమా హిట్ అయిందంటూ పవన్ కల్యాణ్ నుంచీ, ఆఫీస్ బాయ్ వరకు ఆ సినిమాకి పనిచేసిన వాళ్లంతా హ్యాపీగా సంబరాలు చేసుకుంటుంటే, దర్శకుడు జయంత్ మాత్రం నిర్మాత మీద అలిగి, ఆ సంబరాలకు దూరంగా ఉన్నాడట. అసలు సినిమాలు లేక, సక్సెస్ అసలే లేక ఖాళీగా వున్న దర్శకుడు జయంత్ కి ఈ సినిమా మరో లైఫ్ నిచ్చింది. కాబట్టి ఆయన ఇంకా హ్యాపీగానే వుండాలి కదా?
                 అయితే, జయంత్ అలా అలగడానికి అసలు కారణం ఏమిటంటే, ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన డైలాగులు బాగా ప్లస్ అయ్యాయనీ, సినిమా సక్సెస్ క్రెడిట్ నంతా ఆయనకే ఇచ్చేస్తున్నారు. దానికి తోడు జయంత్ కన్నా త్రివిక్రమ్ కే ఎక్కువ పారితోషికం ఇచ్చారట. దాంతో జయంత్ ప్రస్తుతం నిర్మాత, పవన్ కల్యాణ్ లపై అలిగి, సినిమా ప్రమోషన్ కి దూరంగా ఉంటున్నాడని తెలుస్తోంది.

Monday, February 28, 2011

వైభవంగా వైజయంతీ మూవీస్ 'శక్తి' ఆడియో ఫంక్షన్

వైజయంతీ మూవీస్ యన్టీఆర్ కథానాయకుడిగా మెహర్ రమేష్ దర్శకత్వంలో నిర్మించిన 'శక్తి' సినిమా ఆడియో ఫంక్షన్ ఈ రోజు (ఫిబ్రవరి 27) హైదరాబాదులోని హైటెక్స్ ప్రాంగణంలో యన్టీఆర్ అభిమానుల సమక్షంలో వినూత్నంగా, వైభవంగా జరిగింది. అందమైన భారీ వేదికపై పలు డ్యాన్స్ కార్యక్రమాలతో అభిమానులను అలరించే విధంగా ఈ వేడుకను నిర్వహించారు. ఈ సినిమాలోని పాటలకు యన్టీఆర్, ఇలియానా స్టేజ్ పై డ్యాన్స్ లు చేయడం విశేషం. ఈ డ్యాన్సులకి అభిమానులు కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేసారు. పాటల సీడీలను హీరో యన్టీఆర్ రిలీజ్ చేసి, జాకీ ష్రాఫ్, ఇలియానా, మెహర్ రమేష్ తదితరులకు అందజేశాడు.
       ఈ సందర్భంగా నిర్మాత అశ్వనీదత్ మాట్లాడుతూ, "మా బ్యానర్ లో నందమూరి వంశానికి చెందిన మూడు తరాల హీరోలతో సినిమాలు నిర్మించే అదృష్టం దక్కింది. రేపు బాలయ్య బాబు తనయుడితో చేయడానికి కూడా మేం రెడీగా వున్నాం. ఇక ఈ సినిమా గురించి చెప్పాలంటే, యన్టీఆర్ విశ్వరూపాన్ని ఇందులో చూడచ్చు. అంతటి స్థాయిలో ఆయన నటన వుంటుంది. మెహర్ రమేష్ 500 మంది టెక్నీషియన్లతో ఈ సినిమాను వివిధ లోకేషన్లలో షూట్ చేసారు. మా సంస్థ ప్రతిష్టను పెంచే స్థాయిలో సినిమా వుంటుంది" అన్నారు.
         దర్శకుడు మెహర్ రమేష్ చెబుతూ, "నా చిన్నప్పుడు వైజయంతీ మూవీస్ సినిమా వచ్చిందంటే, మా విజయవాడలో అప్సరా థియేటర్ కి వెళ్లి, లైన్ లోనిలబడి టికెట్ తీసుకుని సినిమా చూసేవాడిని. అలాంటి సంస్థలో ఈ భారీ సినిమా చేయడం చాలా హ్యాపీగా వుంది. బడ్జెట్టు, టైము అనే లిమిటేషన్లు పెట్టుకోకుండా సినిమాని తీయమని నిర్మాత దత్తు గారు మాకు చెప్పారు. ఒక విధంగా ఈ సినిమాకు ఆయనే ప్రాణం. ఆయనకు సినిమా నచ్చితే జనానికి నచ్చినట్టే! ఆయన జడ్జిమెంటు అంతలా వుంటుంది. యంగ్ టైగర్ యన్టీఆర్ తన నట విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడిందులో. ఐదు డైమంషన్స్ లో అతను కనపడతాడు. శక్తి పీఠాలకు సంబంధించిన కథ ఇది. యన్టీఆర్ మాత్రమే చేయగల క్యారెక్టర్ ఇది. సినిమాని మన దేశంలోనూ, విదేశాలలోనూ ఎన్నో లోకేషన్లలో షూట్ చేసాం.ఎంతో ప్రయాసతో కుంభమేళాలో కూడా షూటింగ్ చేసాం" అన్నారు. 
       హీరో యన్టీఆర్ మాట్లాడుతూ, "నేనెప్పుడూ ఇలా స్టేజ్ మీద డ్యాన్స్ చేయలేదు. ఇదే తొలిసారి. మీరు ఇంత ప్రేమతో ఈ ఫంక్షన్ కి అతిథులుగా వచ్చారు కాబట్టి చేయాలనిపించింది. ఈ రోజు ఈ వేడుకను చూసి తాతగారు ఎంతగానో ఆనందపడతారనుకుంటున్నాను. మెహర్ రమేష్ నా ఆప్తమిత్రుడు. ఓసారి మలేసియాలో 'ఓ కథ చెబుతాను విను' అంటూ ఈ 'శక్తి' కథ చెప్పాడు. అతనీ కథను ఎవరితో చేద్దామనుకున్నాడో కానీ, నేను మాత్రం 'నాతో కాకుండా ఇంకెవరితో చేస్తావ్?' అన్నాను. మాకు దత్తు గారు తోడయ్యారు. ఈ ప్రాజక్టు అలా మొదలైంది. 'ఆది' సినిమా నుంచీ కూడా మణి అన్న నాకు మంచి సాంగ్స్ ఇస్తున్నాడు. ఇందులో కూడా అదరగొట్టాడు. అలాగే కెమెరా మేన్ సమీర్ రెడ్డి ఫోటోగ్రఫీ అద్భుతంగా వుంది. ఎడిటింగ్ లో ఓ పాటలో నన్ను నేను చూసుకుని నమ్మలేకపోయాను. అలాగే, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొత్త లోకాలు క్రియేట్ చేసాడు. అందరూ ఎవరికి వాళ్లు అద్భుతంగా వర్క్ చేసారు" అన్నారు.
       చివర్లో, ఈ సినిమాలోని యన్టీఆర్ పాత్ర 'రుద్ర'కు సంబంధించిన వీరరసంతో కూడిన ఫోటో పోస్టర్ ను జాకీ ష్రాఫ్ వేదికపై ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఇంకా మంజు భార్గవి, కె.యస్.రామారావు, బోయపాటి శ్రీను, హీరోయిన్లు ఇలియానా, మంజరి, మణిశర్మ, సమీర్ రెడ్డి, నిర్మాత కుమార్తెలు స్వప్నా దత్, ప్రియాంకా దత్ తదితరులు పాల్గొన్నారు. సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఈ వేడుక ప్రారంభానికి ముందు యన్టీఆర్ అభిమానులు వేలాది మంది నగరంలో బైక్ ర్యాలీని నిర్వహించారు.

నేటి వార్తలు....టూకీగా

*  ప్రస్తుతం సంపత్ నందితో ఓ సినిమా ఒప్పుకున్న రామ్ చరణ్ త్వరలో వి.వి.వినాయక్ దర్శకత్వంలో కూడా మరో చిత్రాన్ని చేయనున్నాడు. ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది.
*  'అమ్మ' రాజ శేకర్ దర్శకత్వంలో శ్రీహరి కథానాయకుడుగా నటిస్తున్న 'ముద్ర' సినిమా చివరి షెడ్యులు షూటింగ్ రేపటి (మార్చి 1) నుంచి హైదరాబాదులో జరుగుతుంది.
*  కమేడియన్ అలీ హీరోగా వేమగిరి దర్శకత్వంలో రూపొందిన 'తిమ్మరాజు' సినిమా మార్చి 11 న రిలీజ్ అవుతుంది.
*  'వేదం' తమిళ రీమేక్ నుంచి స్నేహా ఉల్లాల్ ని తొలగించి ఆమె స్థానంలో జాస్మిన్ ని తీసుకున్నారు. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఇప్పటికే శింబు, స్నేహాలపై కొంత షూటింగ్ చేసారు.
*  తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ 'మగధీర' ను హిందీలో రణభీర్ కపూర్ తో రీమేక్ చేయడానికి నిర్మాత అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నాడు.
*  తనపై  కుళ్ళు జోకుల సర్క్యులేషన్, వెబ్ సైట్ (I HATE BALAYYA .COM) నిర్వహణపై బాలకృష్ణ సైబర్ క్రైమ్స్ డీసీపీకి కంప్లయింట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వెబ్ సైట్ ను ఆస్ట్రేలియా నుంచి ఓ తెలుగు వ్యక్తీ నిర్వహిస్తున్నట్టు పోలీసులు కనుగొన్నారు.

మణిరత్నం తో మహేష్ బాబు సినిమా ఖరారు

మహేష్ బాబు ఇప్పుడు చాలా చాలా హ్యాపీగా వున్నాడు. దానికి కారణం నిన్న (ఫిబ్రవరి 27) చెన్నైలో ప్రముఖ దర్శకుడు మణిరత్నం ను కలిసి, ఆయనతో చాలా సేపు మాట్లాడాడు. మణి దర్శకత్వంలో మహేష్ ఓ సినిమా చేయనున్నాడన్న వార్తలు గత కొంత కాలంగా వస్తున్న సంగతి తెలిసిందే. అదిప్పుడు వాస్తవ రూపం దాలుస్తోంది. మహేష్ కూడా దీనిని కన్ఫర్మ్ చేసాడు.
              "ఈ రోజు నా జీవితంలో ఎంతో ఆనందకరమైన దినం. లెజెండరీ మణి సార్ ని కలిసాను. ఆయనతో సినిమా చేయాలన్న నా కల నిజమవుతోంది. మణి సార్ తో సినిమా చేస్తున్నాను" అన్నాడు మహేష్. చారిత్రాత్మక కథాంశంతో మణిరత్నం రూపొందించే భారీ చిత్రంలో మహేష్ నటిస్తున్నాడు. మొదటి నుంచీ ఇందులో ప్రధాన హీరోగా మహేష్ నే తీసుకోవాలని మణి ఆలోచిస్తూ వచ్చాడు. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.

అనుష్కకి 'బాడీ' సమస్య

కథానాయిక అనుష్కకు ఇప్పుడు పెద్ద చిక్కొచ్చిపడింది. అదేమిటంటే, ఓసారి సన్న పడాలి... మరోసారి కాస్త ఒళ్లు తెచ్చుకుని బొద్దుగా తయారవ్వాలి. ఎందుకంటారా... తానిప్పుడు తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో నటిస్తోంది కదా... తమిళ ప్రేక్షకులేమో హీరోయిన్లు కాస్త బొద్దుగా ఉంటేనే ఇష్టపడతారు. సన్నగా నాజూగ్గా వుంటే వాళ్లకి నచ్చదు. మన తెలుగు వాళ్లకైతే, బొద్దుగా వుంటే నచ్చదు. మెరుపు తీగలా, సన్నజాజి తీగలా వుండాలి! ఇప్పుడీ ఇబ్బందిని అనుష్క ఎదుర్కుంటోంది.
           "కోలీవుడ్ కి, టాలీవుడ్ కీ ఒకేసారి డేట్లు ఇస్తే ఇక మా పని అయిపోయినట్టే. బాడీ ప్రాబ్లం వచ్చేస్తుంది. అందుకని రెండు షూటింగులకీ కాస్త గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. తమిళ్ సినిమా షూటింగుకి రెడీ అయ్యే ముందు బాగా తిని ఒళ్లు పెంచాలి. మళ్లీ తెలుగు షూటింగుకి వచ్చే ముందు డైటింగులు, వర్కౌట్లు చేసి సన్నబడాలి. ఇది చాలా కష్టంతో కూడిన వ్యవహారం. ఇలా వుంటాయి మా బాధలు " అంటోంది. అందుకే, చాలా జాగ్రత్తలు తీసుకుంటోందట ఈ మంగుళూరు బ్యూటీ!

ఏ.ఆర్.రెహ్మాన్ కి ఆస్కార్ నిరాశ

సంగీత మాంత్రికుడు ఎ.ఆర్.రెహ్మాన్ కు ఈసారి ఆస్కార్ అవార్డుల్లో నిరాశ ఎదురైంది. ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్న '127 అవర్స్' సినిమాకు అవార్డు రాలేదు. బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో రెహ్మాన్ కు ఈ సినిమా పరంగా ఆస్కార్ నామినేషన్ లభించిన సంగతి తెలిసిందే. అయితే, 'ది సోషల్ నెట్ వర్క్' సినిమా ఈ అవార్డును సొంతం చేసుకుంది. దీనికి సంగీతాన్ని సమకూర్చిన ట్రెంట్ రేజ్నార్, ఆటికస్ రాస్ సంయుక్తంగా బెస్ట్ ఒరిజినల్ స్కోర్ అవార్డును అందుకున్నారు. రెండేళ్ల క్రితం 'స్లం డాగ్ మిలియనీర్' సినిమాకి రెహ్మాన్ రెండు ఆస్కార్లు అందుకున్న సంగతి తెలిసిందే!

త్రిష ప్రయత్నాలు ఫలించేనా?

త్రిష ఈమధ్య రెచ్చిపోయి మరీ పత్రికలకి పోజులిస్తోంది. సౌత్ నుంచి వచ్చే మేగజైన్లకే కాకుండా, ముంబై నుంచి వచ్చే మేగజైన్లకి కూడా హాట్ హాట్ పోజులిస్తూ అందరి మతులూ పోగొడుతోంది. ఈ ఫొటో సేషన్లకి ప్రత్యేకంగా టైం కూడా కేటాయిస్తోంది. త్రిష ఇప్పుడు ఎందుకిలా రెచ్చిపోతూ పోజులిస్తోందన్న విషయాన్ని ఎంక్వైర్ చేస్తే అసలు విషయం బయటపడింది. తన సెక్సీ లుక్కులతో బాలీవుడ్ దృష్టిలో పడడానికట!
               తను నటించిన తొలి హిందీ సినిమా 'కట్టా మీటా' పెద్ద ఫ్లాప్ అవడంతో ఈ చెన్నై భామ ఆమధ్య బాగా అప్ సెట్ అయింది. మళ్లీ అంతలోనే తేరుకుని, ఏది ఏమైనా బాలీవుడ్ లో సక్సెస్ అవ్వాలని డిసైడ్ అయిందట. అందుకని అక్కడ సినిమా అవకాశాలు పొందడానికి ఇప్పుడిలా హాట్ హాట్ గా కనిపిస్తోంది. "సౌత్ కీ, హిందీకీ కాస్త తేడా వుంది. అక్కడ సక్సెస్ కావాలంటే బాగా హాట్ గా కనపడాలి. లేకపోతే కష్టం. అందుకే ఈ ప్రయత్నాలు" అంటోంది నవ్వుతూ. మరి, వ్రతం చెడినా త్రిషమ్మకు ఫలితం దక్కుతుందో, లేదో చూద్దాం!

'బ్రేకింగ్ న్యూస్ బాబూరావ్' గా శివాజీ

హైదరాబాదులోని ఓ ఎఫ్.ఎం. రేడియో 'బ్రేకింగ్ న్యూస్ బాబూరావ్' పేరిట ఓ సెటైరికల్, ఫన్నీ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంటుంది. ఇప్పుడీ పేరుని ఓ సినిమాకి టైటిల్ గా పెట్టుకున్నారు. శివాజీ హీరోగా తేజస్వి క్రియేషన్స్ నిర్మించే ఈ సినిమాకి నూతన దర్శకుడు కర్రి బాలాజీ దర్శకత్వం వహిస్తాడు. ఈ విషయాన్ని ఈ రోజు ఉదయం హైదరాబాదులో జరిగిన ప్రెస్ మీట్ లో నిర్మాతలు తెలియజేసారు. దర్శకుడు చెప్పిన కథ చాలా సరదాగా ఉండడంతో చేయడానికి ఒప్పుకున్నాననీ, సినిమా అంతా ఫన్నీగా సాగుతుందనీ హీరో శివాజీ చెప్పాడు. ఈ చిత్రాన్ని తిరుపతి రావు, పెద్దిరెడ్ల త్రినాధ్, చల్లా రెడ్డి నిర్మిస్తున్నారు. సోమా విజయ ప్రకాష్ సమర్పకుడిగా వ్యవహరిస్తారు. శ్రీలేఖ సంగీతం అందిస్తోంది.

Friday, February 11, 2011

ఒకే రోజు నాలుగు సినిమాల రిలీజ్

ఈమధ్య కాలంలో ఎప్పుడూ జరగనట్టుగా ఫిబ్రవరి 25 న, ఒకే రోజున నాలుగు తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ' రాజ్', 'అహ నా పెళ్ళంట', 'కుదిరితే కప్పు కాఫీ', 'యమకంత్రీ' సినిమాలు ఆ రోజున విడుదలవుతున్నాయి. వి.ఎన్.ఆదిత్య దర్శకత్వం వహించిన 'రాజ్' లో సుమంత్ హీరోగా, ప్రియమణి, విమలా రామన్ హీరోయిన్లుగా నటించారు. 'అహ నా పెళ్ళంట'లో అల్లరి నరేష్ హీరోగా నటించగా, 'కుదిరితే కప్పు కాఫీ' సినిమాలో వరుణ్ శందేశ్ హీరోగా నటించాడు. ఇక ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందిన 'యమకంత్రి' సినిమాలో విజయ్, నయనతార జంటగా నటించారు. ఈ నాలుగు సినిమాల్లో ఏవి హిట్ అవుతాయో, ఏవి ఫట్ అవుతాయో చూడాలి!

నయనతారకి వేలెంటైన్స్ డే సెలెబ్రేషన్ లేదా?

ప్రేమికులకి వేలెంటైన్స్ డే అయిన ఫిబ్రవరి 14 చాలా పవిత్రమైన రోజు. ఈ రోజు ఎన్ని పనులున్నా, ఎక్కడున్నా కూడా ప్రేమికులు, అందులోనూ పెళ్లి కాని ప్రేమికులు తప్పకుండా కలుసుకుని, హ్యాపీగా సెలెబ్రేట్ చేసుకుంటారు. అయితే, ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ ప్రేమికులుగా, ఖరీదైన లవ్వర్స్ గా పేరుతెచ్చుకున్న ప్రభుదేవా, నయనతారలు ఆ రోజు అసలు కలుసుకునేలానే లేరు. ఎందుకంటే, ఆ రోజు ఇద్దరూ చెరో చోటా ఉంటున్నారట! ప్రభుకైతే అస్సలు ఖాళీ లేదట. ఓపక్క తను జయం రవి, హన్సికలతో రూపొందించిన 'ఎంజియమ్ కాదల్' సినిమా ఫిబ్రవరి 26 న రిలీజ్ అవుతోంది. ఆ సినిమా ఫినిషింగ్ వర్క్ లో చాలా బిజీనట. అలాగే, మరో పక్క ముంబై లో సంజయ్ లీలా భన్సాలీ ఇతని దర్శకత్వంలో అక్షయ్ కుమార్ హీరోగా నిర్మిస్తున్న చిత్రం క్లైమాక్స్ కి సంబంధించిన డిస్కషన్స్ వున్నాయి. 'ఇన్ని పనులతో ఇక వేలెంటైన్స్ డే సెలెబ్రేషన్ కి టైమెక్కడ?' అంటున్నాడు ప్రభు. మరి, ఇప్పుడే ఇలా అంటే, రేపు పెళ్లయ్యాక అసలు నయన్ కి టైం కేటాయిస్తాడా? 

నిఖిల్ హీరోగా 'వీడు తేడా' ప్రారంభం

నిఖిల్ హీరోగా నూతన దర్శకుడు చిన్ని కృష్ణ దర్శకత్వంలో లక్ష్మీ నరసింహా ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న 'వీడు తేడా' సినిమా షూటింగ్ ఈ రోజు (ఫిబ్రవరి 10) ఉదయం హైదరాబాదులోని అన్నపూర్ణా స్టుడియోలో ప్రారంభమైంది. తొలి షాట్ కు ప్రముఖ నిర్మాత రామానాయుడు కెమెరా స్విచాన్ చేయగా, దర్శకుడు వి.వి.వినాయక్ క్లాప్ నిచ్చారు. ఈ సందర్భంగా హీరో నిఖిల్ మాట్లాడుతూ, "నాకిది ఏడవ సినిమా. కథ, దానిని దర్శకుడు చెప్పిన విధానం నచ్చాయి. నాకు మంచి సినిమా అవుతుందనుకుంటున్నాను" అన్నాడు.  దర్శకుడు చిన్ని కృష్ణ చెబుతూ, "దర్శకుడు వినాయక్ వద్ద పనిచేసాను. అలాగే, 'కొత్త బంగారు లోకం' సినిమాలో హాస్టల్ వార్డెన్ గా నటించాను. ఇది నా తొలి సినిమా. బాగా తీస్తానన్న నమ్మకం వుంది" అన్నారు. చక్రి సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రంలో పూజా బోస్ హీరోయిన్ గా నటిస్తోంది.

'గగన'విహారం వర్కౌట్ అవుతుందా?

విడుదలకు ముందే ప్రివ్యూల పరంగా 'గగనం' సినిమాకు శతప్రదర్శనోత్సవాన్ని జరిపేసేలా వున్నాడు నిర్మాత దిల్ రాజు. మొన్న, నిన్న హైదరాబాదులో ప్రివ్యూల మీద ప్రివ్యులు వేసేసిన నిర్మాత ఈ రోజు విశాఖ, రాజమండ్రి, విజయవాడ ప్రాంతాలలో కూడా వేస్తున్నాడు. అభిమానులని, నగర ప్రముఖుల్ని ఈ షోలకి ఇన్వయిట్ చేసాడు. ఈ షోలకి యూనిట్ అటెండ్ అవడానికి ఈ రోజు ప్రత్యేకంగా 10 లక్షలు వెచ్చించి, చార్టెడ్ ఫ్లయిట్ ను కూడా బుక్ చేసాడు. ఈ రోజు పొద్దున్నే అందులో నాగార్జున, ప్రకాష్ రాజ్, దిల్ రాజ్, పూనం కౌర్ తదితర యూనిట్ బృందమంతా బయలు దేరి వెళ్లి, ఆంధ్రా అంతటా చక్కర్లు కొడుతోంది. ఒక్కో షోకి ఒక్కో పట్టణంలో ఉండేలా ప్లాన్ చేసుకుని ఆయా థియేటర్లను విజిట్ చేస్తున్నారు. అక్కడ అభిమానుల కోలాహలం కూడా బాగానే వుంది. ఈ సినిమా ఓ కొత్త తరహా ప్రయోగం కావడంతో, జనం చూస్తారో, లేదోనన్న భయంతో, నిర్మాత ప్రమోషన్ లో భాగంగా ఈ కొత్త పోకడను ఎంచుకున్నాడన్న మాట!

ఆర్ధిక ఇబ్బందుల్లో రాధిక చెల్లి నిరోషా

సినిమా ఇండస్ట్రీలో తారలు లైమ్ లైట్ లో వున్నప్పుడు సంపాదించుకున్నది జాగ్రత్త చేసుకోకపోతే ఆ తర్వాతి కాలంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఆ బాపతు మనుషుల్ని సినిమా రంగంలో చాలా మందిని చూసాం. రాధిక చెల్లెలు, ఒకప్పటి కథానాయిక నిరోషా కూడా ఇప్పుడీ రకం మనుషుల్లో చేరిపోయింది. ఇరవయ్యేళ్ల క్రితం వచ్చిన సూపర్ హిట్ సినిమా 'సింధూర పువ్వు' లో తనతో పాటు కలిసి నటించిన రాంకీ ని పెళ్లి చేసుకున్న నిరోషా, ఇప్పుడు తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందుల్లో వున్నట్టు తెలుస్తోంది.
         తను ఆర్టిస్టుగా మంచి పొజిషన్ లో ఉండగానే ఈ నటి రాంకీ ని మేరేజ్ చేసుకుంది. ఆ తర్వాత కొన్నాళ్లకి ఇద్దరికీ అవకాశాలు తగ్గాయి. దాంతో నిరోషా టీవీ సీరియల్స్ లో కూడా నటించింది. అయితే, ఆమధ్య ఈ దంపతులు చెన్నయ్ లోని జెమినీ సర్కిల్ ప్రాంతంలోని పార్శెన్ కాంప్లెక్స్ లో వున్న రెండు ఫ్లాట్స్ ని తనఖా పెట్టి, కార్పొరేషన్ బ్యాంక్ నుంచి 50 లక్షలు అప్పుగా తీసుకున్నారట. ఎన్ని నోటీసులిచ్చినా, తిరిగి ఆ మొత్తం చెల్లించకపోవడంతో సదరు బ్యాంకు అధికారులు ఆ ఫ్లాట్స్ ను వేలం వేయడానికి సిద్ధం అవుతున్నారని కోలీవుడ్ సమాచారం.

ఆ హీరోయిన్ కి వరుసగా మరో ఛాన్సిచ్చిన సిద్ధార్థ్!

ఈ మధ్య కాలంలో ఒక్క హిట్టు కూడా లేకుండా వరుస ఫ్లాపుల్లో వున్న సిద్ధార్థ్ ఖాళీగా మాత్రం లేడు. ఏదో ఒక సినిమా వస్తూనే వుంది. ఇటీవల వచ్చిన 'అనగనగా ఓ ధీరుడు' సినిమా డిజాస్టర్ అయినప్పటికీ, దిల్ రాజు ఇతనితో మరో సినిమా ప్లాన్ చేసాడు. నూతన దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి వర్కింగ్ టైటిల్ గా 'ఓ మై ఫ్రెండ్' అన్న పేరు పెట్టుకున్నారు. ఈ సినిమా షూటింగు బుధవారం నాడు హైదరాబాదులో లాంచనంగా ప్రారంభమైంది. రెగ్యులర్ షూటింగును ఫిబ్రవరి 21 నుంచి జరుపుతారు. ఇదిలా ఉంచితే, ఈ సినిమాలో హీరోయిన్ గా నిత్య మీనన్ ని ఎంపిక చేసారట. ఈమెను హీరో సిద్దార్దే రికమండ్ చేసినట్టు తెలుస్తోంది. మరో పక్క సిద్ధార్థ్ ప్రస్తుతం నటిస్తున్న తెలుగు, తమిళ చిత్రం '180' లో కూడా నిత్యానే కథానాయిక. ఒక సినిమా రిలీజ్ కాకుండానే వరుసగా మరో సినిమాలో కూడా నిత్యాకు ఛాన్స్ ఎందుకిచ్చాడబ్బా? అంటూ టాలీవుడ్ జనం వేరే అర్థాలు తీస్తున్నారు!

తన అసోసియేట్ ని పెళ్లాడుతున్న దర్శకుడు

తెలుగులో '7 జి. బృందావనం కాలనీ', 'ఆడువారి మాటలకు అర్థాలు వేరులే' వంటి సినిమాలకి దర్శకత్వం వహించిన తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ తన దగ్గర అసోసియేట్ గా పనిచేస్తున్న గీతాంజలి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు. వీరి వివాహ నిశ్చితార్థం ఈ రోజు (ఫిబ్రవరి 10) చెన్నయ్ లో వధువు ఇంట్లో జరిగింది. గీతాంజలి తమిళనాడు రాష్ట్ర అడ్వకేట్ జనరల్ పి.యస్.రామన్ కుమార్తె. ఈ సందర్భంగా పెళ్లి ముహూర్తం కూడా పెట్టారు. జూలై 3 న చెన్నయ్ లోని హోటల్ లీ మెరిడియన్ లో మేరేజ్ జరుగుతుంది. నేటి వేడుకకు రజనీకాంత్, కమల హాసన్, వెంకటేష్, రానా, మణిరత్నం, సుహాసిని, గౌతమి, అబ్బాస్, రీమాసేన్, యువన్ శంకర్ రాజా తదితరులు హాజరయ్యారు. సెల్వ రాఘవన్ గతంలో నటి సోనియా అగర్వాల్ ను వివాహం చేసుకుని, కొన్నాళ్లకు డైవోర్స్ తీసుకున్నాడు.

బర్మాలో సందడి చేసిన రామ్ చరణ్

తండ్రి రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ఆయన తరఫున రామ్ చరణ్ పెద్దరికాన్ని తీసుకుని పలు ఫంక్షన్లకు హాజరవుతున్నాడు. పైగా, షూటింగులు కూడా ఇంకా ఏమీ స్టార్ట్ కాకపోవడంతో ఈ ఖాళీ సమయాన్నిలా వినియోగించుకుంటున్నాడు. మొన్నామధ్య ముంబైలో జరిగిన ఆమిర్ ఖాన్ మేనల్లుడు ఇర్ఫాన్ పెళ్లి రిసెప్షన్ కి అటెండ్ అయిన చరణ్, తాజాగా మయాన్మార్ (బర్మా) వెళ్లాడు. బ్రిటిష్ వాళ్ల పాలనలో మన తెలుగు వాళ్లు ఎంతో మంది పనుల కోసం అప్పటి బర్మాలోని రంగూన్ వెళ్లి, అక్కడే స్థిరపడిపోయారు. వాళ్లంతా యాంగాన్ నగరంలో 'బర్మా తెలుగు అసోసియేషన్' గా ఓ సంఘం కూడా పెట్టుకున్నారు. ఆ సంస్థ శత వార్షికోత్సవాలు ఇప్పుడు జరుగుతున్నాయి. వీటికి చీఫ్ గెస్ట్ గా చరణ్ హాజరయ్యాడు.
        అభిమాన హీరో తమ కళ్ళ ముందు ప్రత్యక్షమవడంతో వాళ్లంతా కేరింతలు కొడుతూ రిసీవ్ చేసుకున్నారు. "బర్మాలో నాలుగు లక్షల మంది తెలుగు వాళ్లు వున్నారంటే నమ్మలేకపోతున్నాను. వారు నాపై చూపించిన ప్రేమపూర్వక ఆదరణకి ముగ్దుడినయ్యాను. ఆ అందమైన ప్రదేశం, రుచికరమైన వాళ్ల వంటలు నన్నెంతో ఆకట్టుకున్నాయి" అంటున్నాడు చరణ్. ఈ మాటలు విన్న అల్లు శిరీష్ "నాలుగు లక్షల మందా? అంటే, ముంబై, పూనే, అహ్మదాబాద్ లలో వున్న తెలుగు వాళ్ల కంటే ఎక్కువన్న మాట. అయితే, మన నెక్స్ట్ మార్కెట్ బర్మానే!" అంటూ వ్యాపార దృష్టితో కామెంట్ చేసాడు.

నేటి సినిమా వార్తలు... టూకీగా!

ఈ రోజు (ఫిబ్రవరి 11 ) 'గగనం', 'వస్తాడు నా రాజు' సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
*      వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందే తాజా చిత్రం షూటింగ్ మార్చి 15 న ప్రారంభమవుతుంది.
*      ఈ నెల 25 న రిలీజ్ అవ్వాల్సిన 'యమ కంత్రీ' సినిమా వాయిదా పడింది. మార్చి 4 న రిలీజ్ చేస్తారట.
*      అల్లరి నరేష్ హీరోగా నటించిన 'అహ నా పెళ్ళంట' సినిమాని ఇటీవల మరణించిన దర్శకుడు ఈవీవీ సత్యనారాయణకు అంకితం చేస్తున్నారు.
*      రఫీ హీరో, దర్శకుడుగా రూపొందే తెలంగాణా ఉద్యమ చిత్రం 'ఇంకెన్నాళ్ళు' పాటల రికార్డింగ్ జరుగుతోంది.
*      'తెలంగాణా జిందాబాద్' పేరుతో మరో ఉద్యమ చిత్రాన్ని ఎం.యస్. గుప్తా నిర్మిస్తున్నారు.
*      ఎల్.బీ.శ్రీరాం, అలీ తాతామనవళ్ళుగా నటించిన 'తిమ్మరాజు' సినిమా ఫిబ్రవరి నెలాఖరున రిలీజ్ అవుతోంది. 
*      రాంగోపాల్ వర్మ తీస్తున్న ఐదు రోజుల సినిమా 'దొంగల ముఠా' మూడో రోజు షూటింగ్ లో వుంది.
*      శ్రీహరి హీరోగా డ్యాన్స్ మాస్టర్ అమ్మ రాజశేకర్ దర్శకత్వంలో 'ముద్ర' పేరుతో ఓ సినిమా తయారవుతోంది.

కాజల్ ఇక బాలీవుడ్ చెక్కేస్తుందా?

పైకి ఎన్ని కబుర్లు చెప్పినా కథానాయికలందరికీ వాళ్ల అంతిమ లక్ష్యం బాలీవుడ్డే అన్న సంగతి మనకు తెలుసు. ఎందుకంటే, హిందీ సినిమాల్లో క్లిక్ అయితే ఇక వాళ్ల పంట పండినట్టే. రీజనల్ లాంగ్వేజెస్ లో ఎన్ని సినిమాలు చేసినా రాని పేరు ఒకటి, రెండు హిందీ సినిమాలు చేస్తే చాలు, వచ్చేస్తుంది. అందుకే, సౌత్ సినిమాలలో చేస్తున్నప్పటికీ హీరోయిన్లంతా బాలీవుడ్ మీద ఓ లుక్కేస్తూనే వుంటారు. ఇప్పుడీ లిస్టులో కాజల్ కూడా చేరింది. తాజాగా ఓ హిందీ చిత్రాన్ని యాక్స్పాట్ చేసింది. తమిళంలో సూపర్ హిట్ అయిన 'సింగం' సినిమాని అజయ్ దేవగణ్ హీరోగా హిందీలో ఇప్పుడు రిమేక్ చేస్తున్నారు. ఇందులో మొదట అనుష్కని తీసుకోవాలనుకున్నారు. అయితే, ఆమె బాలీవుడ్ కి వెళ్లడానికి ఇంటరెస్ట్ చూపించక పోవడంతో, ఇప్పుడా అవకాశం కాజల్ కి దక్కింది. సో... తనక్కడ కూడా సక్సెస్ అవుతుందేమో చూద్దాం!

రేపే నాగార్జున 'ఢమరుకం' ప్రారంభం

నాగార్జున హీరోగా నటించే సోషియో ఫ్యాంటసీ చిత్రం 'ఢమరుకం' షూటింగ్ రేపే (ఫిబ్రవరి 12) ప్రారంభమవుతోంది. మినిమం గ్యారంటీ దర్శకుడిగా కామెడీ చిత్రాలు రూపొందించే శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో దీనిని ఆర్.ఆర్.మూవీ మేకర్స్ అధినేత వెంకట్ నిర్మిస్తున్నాడు.  భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా కోసం భారీ సెట్స్ కూడా వేస్తున్నారు. అలాగే ఈ సబ్జక్ట్ కి కాస్ట్యూమ్స్ పరంగా కూడా  రిచ్ నెస్ అవసరమట. ఆ విషయంలో కూడా స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. ఫ్యాంటసీ కథాంశం మిళితమైనందువల్ల గ్రాఫిక్స్ కి కూడా ఎంతో ప్రాధాన్యత ఉందనీ, సుమారు 50 నిమిషాల పాటు స్క్రీన్ మీద ఈ గ్రాఫిక్స్ మాయాజాలం ప్రేక్షకులను మరో లోకంలో విహరింపజేస్తుందట. ఇందులో నటించే హీరోయిన్ గా ఇప్పటికే అనుష్కను ఎంపిక చేసారు.   
Related Posts Plugin for WordPress, Blogger...