e-cigarette review Ping Yahoo GOSSIPS: April 2011

Monday, April 25, 2011

మరో 'బొమ్మరిల్లు' తీస్తున్న దిల్ రాజు?

సిద్ధార్థ్ హీరోగా భాస్కర్‌ దర్శకత్వంలో గతంలో వచ్చిన ‘బొమ్మరిల్లు’ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. అంతేకాదు, నిర్మాత 'దిల్' రాజు బ్యానర్‌ వాల్యూను కూడా మరింత పెంచిందని చెప్పచ్చు. దానికి కారణం, మంచి కుటుంబకథను చక్కని స్క్రీన్ ప్లే తో చెప్పడమే! అందుకే, దిల్ రాజు ఇప్పుడు మళ్లీ సిద్ధార్థ్ తో తీస్తున్న 'ఓ మై ఫ్రెండ్' సినిమాకు కూడా ఫేమిలీ డ్రామాతో కూడిన కథనే ఎంచుకున్నాడని అంటున్నారు. ఈ సినిమా ద్వారా వేణు శ్రీరాం దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాలో సిద్ధార్థ్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, నవదీప్, హన్సిక మరో జంటగా నటిస్తున్నారు.

సంగీత దర్శకురాలిగా కౌసల్య

చక్రి సంగీత దర్శకత్వంలోనే ఎక్కువగా పాటలు పాడే ప్రముఖ గాయని కౌసల్య కూడా ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అవుతోంది. నూతన దర్శకురాలు హేమారెడ్డి రూపొందించే ఓ చిత్రానికి ఆమె సంగీతాన్ని సమకూరుస్తోంది. గతంలో పలువురు ప్రముఖ దర్శకుల వద్ద పని చేసిన హేమారెడ్డి ఈ చిత్రాన్ని నూతన తారలతో రూపొందిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఆర్టిస్టుల టాలెంట్ సెర్చ్ కార్యక్రమం హైదరాబాదులోని బిగ్ బజార్ షాపింగ్ మాల్ లో ప్రారంభమైంది. బిగ్ బజార్ లో షాపింగ్ చేసిన వారికి ఇందులో నటించే అవకాశం దొరుకుతుందని నిర్వాహకులు తెలిపారు.

సమీరా రెడ్డికి ఇంతలోనే ఏమైంది?

ఏమిటో సమీరారెడ్డికి ఉన్నట్టుండి ఒక్కసారిగా వైరాగ్యం పట్టేసుకుందిప్పుడు. అవును... 'అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలి? చేసుకోకుండా వుండలేమా? నాకైతే పెళ్లి చేసుకోవాలని లేదు. సింగిల్ గానే ఉండాలనుకుంటున్నాను' అంటూ తాజాగా ఓ స్టేట్ మెంట్ ఇచ్చింది. దాంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు, ఇంతలోనే అమ్మడికి ఏమైందంటూ!
                అసలు విషయం ఏమిటంటే, ఈమధ్య తన స్నేహితురాలి పెళ్లి ఏర్పాట్లన్నీ దగ్గరుండి తనే చూసిందట. దాంతో ఈ పెళ్లి తంతు మీద చిరాకు, విసుగు వచ్చేశాయట.  దానికి తోడు, పెళ్లి అనే బంధంతో ఒకరికి భారం అవడం, మరొకరు మనకి బరువవడం తనకిష్టం లేదట. అందుకే పెళ్లికి దూరంగా వుండాలనుకుంటున్నట్టు చెబుతోంది. పెళ్లీడుకొచ్చిన పిల్ల ఇలా మాట్లాడడంతో, సమీరా ఎక్కడో దెబ్బతినే ఉంటుందని బాలీవుడ్ లో కామెంట్లు వినపడుతున్నాయి.     

'బద్రీనాథ్' కి మూడు పాటలు బ్యాలెన్స్

అల్లు అర్జున కథానాయకుడుగా వి.వి.వినాయక్ డైరెక్షన్ లో గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ నిర్మిస్తున్న భారీ చిత్రం 'బద్రినాథ్' షూటింగుకు సంబంధించి ఇక మూడు పాటలు మాత్రం మిగిలి వున్నాయి. వీటిని వచ్చే నెలలో చిత్రీకరిస్తారు. ఇదిలా ఉంచితే, మరోపక్క చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వేగంగా జరుగుతోంది. అలాగే, ప్యాచ్ వర్క్ షూటింగ్  ఈ వారంలో పూర్తి చేస్తారు. అల్లు అర్జున్ ఇండియన్ సమురాయ్ గా నటిస్తున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో నిర్మాణం జరుపుకుంటున్న భారీ బడ్జెట్ చిత్రాలలో బద్రీనాథ్ ముందుంది. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇటీవల రూపొందిన భారీ చిత్రాలన్నీ బాక్సాఫీసు వద్ద ఫెయిలైన నేపథ్యంలో ఈ చిత్రం పట్ల టాలీవుడ్ లో ఆసక్తి నెలకొంది! జూన్ మొదటి వారంలో దీనిని రిలీజ్ చేస్తారు.

తమన్నాకి, చైతన్యకి మధ్య గొడవా?

తమన్నాకి, నాగ చైతన్యకి మధ్య ఇప్పుడు క్షణం కూడా పడటం లేదట. ఎప్పుడూ ఏదో ఒక విషయంపై పోట్లాటే. ఇద్దర్నీ ఎవరైనా చూస్తే కనుక అసలు వాళ్లెందుకు తగవులాడుకుంటున్నారో అర్ధంకాదు. ఈ విషయాన్ని తమన్నానే చెబుతోంది. అయితే...ఇది నిజజీవితంలో కాదులెండి. త్వరలో విడుదల కానున్న '100% లవ్' సినేమాలోనన్న మాట!
                   "అందులో నా పేరు మహాలక్ష్మి. తన పేరు బాలు. ప్రతి చిన్న విషయానికీ ఇద్దరం పోట్లాడుకుంటూ వుంటాం. మరోలా చెప్పాలంటే కార్టూన్ ఫిలిం 'టాం అండ్ జెర్రీ' టైపన్న మాట. మామధ్య ఇలా చిటపటలున్నా.. చూసే వాళ్లకి మాత్రం మంచి ఫన్ గా వుంటుంది" అంటోంది తమన్నా. ఈ సినిమా మే మొదటి వారంలో రిలీజ్ అవుతోంది. చాలా కాలం తర్వాత వస్తున్న తన తెలుగు చిత్రం కాబట్టి, దీని మీద చాలా హోప్స్ పెట్టుకుంది. దీంతో బాటు 'బద్రీనాథ్', 'ఊసరవెల్లి' చిత్రాలు తనని టాలీవుడ్ లో నెంబర్ వన్ స్టార్ ని చేసేస్తాయని ఆశిస్తోంది తమన్నా.

రేపటి నుంచి తిరిగి షూటింగులు

గత పద్దెనిమిది రోజులుగా టాలీవుడ్ లో జరుగుతున్న సినీ కార్మికుల సమ్మె ఓ కొలిక్కి వచ్చింది. సమ్మె విరమించి, మంగళవారం నుంచి వీరు షూటింగులలో పాల్గొంటారు. నిర్మాతలకు, ఫిలిం ఫెడరేషన్ కూ మధ్య ఈ రోజు జరిగిన చర్చలు ఫలించి, ఒప్పందం కుదిరింది. కార్మికులకు 32 శాతం మేర వేతనాలు పెంచడానికి నిర్మాతలు అంగీకరించారు. కార్మికుల సమ్మె కారణంగా ఎక్కడి షూటింగులు అక్కడే ఆగిపోయిన సంగతి తెలిసిందే.
                  ఈ విషయంపై పలుసార్లు నిర్మాతలతో చర్చలు జరిగినా, వేతనాల పెంపుపై ప్రతిష్టంభన ఏర్పడింది. తమ డిమాండ్ మేర వేతనాలు పెంచాల్సిందేనని కార్మికులు పట్టుపట్టడంతో నిర్మాతలు దిగిరాక తప్పలేదు. ఇదిలా ఉంచితే, తమను సంప్రదించకుండా నిర్మాతల మండలి ఒప్పందాలు చేసుకుంటోందని చిన్న నిర్మాతలు ఆరోపిస్తున్నారు.

రాజమౌళి సినిమాలో నితిన్

సరైన సినిమాలు లేక, సక్సెస్ అసలే లేక వెనుకపడిపోయిన నితిన్ తాజాగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో నటించే అవకాశాన్ని పొందాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో 'సై' సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు వచ్చిన ఆఫర్ మాత్రం గెస్ట్ రోల్ అని తెలుస్తోంది. ప్రభాస్ కథానాయకుడుగా రాజమౌళి రూపొందించే సినిమాలో ఓ ముఖ్య పాత్రకు నితిన్ సెలెక్ట్ అయ్యాడు. రాజమౌళి అడగ్గానే నితిన్ వెంటనే అంగీకరించినట్టు చెబుతున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్ర రావు నిర్మించనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తను రూపొందిస్తున్న 'ఈగ' సినిమా పూర్తయ్యాక ఈ చిత్రాన్ని రాజమౌళి ప్రారంభిస్తాడు.

Tuesday, April 19, 2011

రామ్ తో తమన్నా ప్రేమకథ

ప్రస్తుతం యంగ్ హీరోలలో వెనుకపడిపోయిన రామ్ ఒక హిట్ కోసం ఈమధ్య పరితపిస్తున్నాడు. ఆ ప్రయత్నంలో ప్రస్తుతం హన్సికతో 'కందిరీగ' సినిమా  చేస్తున్నాడు. దీని తర్వాత ఓ ప్రేమకథను చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఆ చిత్రానికి ప్రేమకథల స్పెషలిష్టు కరుణాకరన్ దర్శకత్వం వహిస్తాడు. ప్రస్తుతం కరుణాకరన్ దీనికి సంబంధించిన స్క్రిప్టు పనిలో బిజీగా వున్నాడు. కాగా, పరుచూరి ప్రసాద్ నిర్మించే ఈ చిత్రంలో కథానాయికగా తమన్నా ఎంపికైనట్టు తెలుస్తోంది. రెమ్యునేరేషన్ కాస్త ఎక్కువైనప్పటికీ తమన్నానే బుక్ చేయమని దర్శకుడితో బాటు హీరో రామ్ కూడా పట్టుబట్టినట్టు చెబుతున్నారు. ఈ చిత్రానికి 'మన లవ్ స్టోరీ' అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేశారట! 

యన్టీఆర్ పెళ్లిలో తెనుగు సంస్కృతి

ఈమధ్య మన సినిమా వాళ్ల ఇళ్ళల్లో పెళ్లిళ్ళన్నీ ఎక్కువగా ఉత్తరాది సంప్రదాయ పద్ధతిలో జరుగుతున్నాయి. సంగీత్, మెహందీ వంటి మన సంప్రదాయం కాని కార్యక్రమాలే ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. అయితే, 'ఇవన్నీ తన పెళ్లిలో బంద్' అంటున్నాడు యన్టీఆర్. అచ్చతెనుగు సంప్రదాయాలకు, సంస్కృతికి తన వివాహంలో పెద్దపీట వేయాలని ఆయన నిర్ణయించుకున్నాడు. ఓ తెలుగు పల్లెటూర్లో, ఓ కలవారి ఇంట జరిగే వివాహంగా తన వివాహం జరగాలని ఆయన కోరుకుంటున్నాడు.
                     అంటే, అచ్చం 'పెళ్లి పుస్తకం' సినిమాలోని 'శ్రీరస్తు...శుభమస్తు..శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం' పాటలో బాపుగారు చూపించిన పద్ధతిలో యన్టీఆర్ వివాహ వేడుక ఉంటుందన్న మాట! అందుకే, శుభలేఖతో బాటు స్వీట్లు పంచే పద్ధతిని కూడా ఆయన పెట్టుకోలేదు. సోమవారం నాడు హైదరాబాదులో సినీ ప్రముఖులు కృష్ణ, కృష్ణంరాజు, రామానాయుడు, చిరంజీవి, రాఘవేంద్రరావు, రాజమౌళి, వినాయక్ ల ఇళ్లకు వెళ్లి, పెళ్లి శుభలేఖల్ని స్వయంగా ఇచ్చి ఆహ్

ట్రాఫిక్ కానిస్టేబుల్ గా కమల హాసన్

కమల హాసన్ ఏ పాత్ర పోషించినా దానికో ప్రత్యేకత వుంటుంది. తాజాగా ఆయన పోషించబోయే పోలీస్ కానిస్టేబుల్ పాత్ర కూడా అటువంటిదే. ఇటీవల మలయాళంలో వచ్చిన 'ట్రాఫిక్' అనే సినిమా కమల్ ని బాగా ఆకట్టుకుందట. దాంతో ఆ చిత్రాన్ని తమిళ, తెలుగు భాషల్లో రీమేక్ చేసే పనిలో పడ్డాడిప్పుడు. ఇందులో తను ట్రాఫిక్ కానిస్టేబుల్ గా నటిస్తాడట. ఇదిలా ఉంచితే, సెల్వరాఘవన్ డైరెక్షన్ లో తాను నటించనున్న విశ్వరూపం సినిమా షూటింగ్ విదేశాలలో జరగాల్సి వుంది., అయితే, యూనిట్ కి వీసాలు రావడంలో జాప్యం జరుగుతోంది. దాంతో ఈలోగా ఈ కానిస్టేబుల్ సినిమాలో నటించడానికి కమల్ ప్లాన్ చేసుకుంటున్నాడని కోలీవుడ్ సమాచారం.

షకీలా పాట కూడా పాడింది!

ఒకప్పుడు శృంగార నటిగా కుర్రకారుకి నిద్రలు లేకుండా చేసిన షకీలా గుర్తుంది కదూ.... ఇప్పుడామె కొత్త అవతారం ఎత్తుతోంది. పాటకు డ్యాన్స్ చేయడమే కాదు...పాట కూడా పాడతాను.. అంటూ సిద్ధమైంది.  అయితే, ఆమె పాడింది...'షణ్ముగపురం'  అనే తమిళ సినిమాలో. ఆ పాట కూడా మాంచి హాట్ సాంగే కావడం విశేషం. "ఈ సినిమాలో ఓ మంచి పాత్ర చేస్తున్నాను. అందులో నాకో పాట వుంటుంది. దాంతో డైరెక్టర్ గారు, 'అది నువ్వే పాడితే బాగుంటుంది' అన్నారు. సరే, ఒకసారి ట్రై చేద్దాం అని పాడి చూశాను. అంతా 'చాలా బాగుంది, సూపర్' అంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చారు" అంటోంది షకీలా. అయితే, పాట పాడడం అన్నది నటించినంత ఈజీ జాబ్ కాదని చెబుతోంది షకీలా. అవకాశాలోస్తే ముందు ముందు ఇలాగే పాడుతుందట. సో... ఇక షకీలాలో రెండో కోణం చూడనున్నాం!

జెనీలియా కోరిక తీరడంలేదట!

ముంబయ్ భామ జెనీలియా ఎంత మొత్తుకున్నా, ఎన్నిసార్లు అడిగినా జాన్ అబ్రహాం మాత్రం ఆమె కోరిక తీర్చడం లేదట. ఎప్పటికప్పుడు 'నో' చెప్పేస్తున్నాడట. అసలు విషయం ఏమిటంటే, జాన్ రైడ్ చేస్తుంటే అతని బైక్ మీద కూర్చోవడానికి అంతా భయపడతారు. ఎందుకంటే, అతను వ్యోమగామిలా రేకెట్ మీద వెళుతున్నట్టు దూసుకుపోతాడు. కళ్ళు మూసి తెరిచేలోగా అదృశ్యమవుతాడు. ఒకవేళ తన బైక్ మీద ఎవరినైనా ఎక్కించుకుంటే వాళ్లకి రిస్క్ కదా... అని ఆలోచించి వెనుక సీటే తొలగించేశాడట! అయితే, జేన్నీకేమో అతని రైడ్ ని ఎంజాయ్ చేయాలన్నది చిరకాల కోరిక. దాంతో పాపం...జెన్నీ కోరిక తీరడంలేదు. ఎప్పటికైనా మళ్లీ వెనుక సీటు ఫిట్ చేయించి, తనని రైడ్ కి తీసుకువెళతాడని ఆశగా ఎదురుచూస్తోంది! 

బాలీవుడ్ కి గురిపెట్టిన ముద్దుగుమ్మ

త్వరలో బాలీవుడ్ లో పెద్ద స్టార్ ని కావడమే తన ముందున్న లక్ష్యం అంటోంది బెంగాలీ భామ శ్రద్దాదాస్. 'ఇప్పటికే అక్కడ నాలుగు సినిమాల్లో యాక్ట్ చేశాను. నాకంటూ ఓ గుర్తింపు కూడా వచ్చింది. ఇక మంచి హిట్ పడితే సెటిల్ అయిపోతాను' అంటోంది. నటనతో బాటు పాటలు కూడా పాడాలన్నది తన కోరికని చెబుతోంది. "ఆమధ్య 'సై ఆట' సినిమాలో దేవిశ్రీ నాచేత ఓ పాట పాడించారు. నా బాడీ లాంగ్వేజ్ కి సింగింగ్ కూడా బాగా సూట్ అవుతుందని చాలా మంది అంటుంటారు. అందుకే బాలీవుడ్ లో సింగర్ గా కూడా ట్రై చేస్తున్నాను" అంటోంది. తనకిక తెలుగులో ఎలాగూ అవకాశాలు రావని శ్రద్దా డిసైడ్ అయిపోయినట్టుంది. అందుకే 'బాలీవుడ్ మీదే తన దృష్టి' అంటోంది. 

నేటి వార్తలు....టూకీగా

*  కథానాయిక తాప్సీ తొలిసారిగా 'మిస్టర్ పెర్ ఫెక్ట్' సినిమాకు డబ్బింగ్ చెప్పింది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని ఈ నెల 22 న రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాత దిల్ రాజ్ చెప్పాడు.
*  వైభవ్, స్నేహ జంటగా వెంకట్ ప్రభు డైరెక్షన్ లో తమిళంలో రూపొందిన 'గోవా' సినిమాని అదే పేరుతో తెలుగులోకి డబ్ చేస్తున్నారు. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి.ఈ వారంలో పాటల్ని రిలీజ్ చేస్తారు.
*  తెలుగులో వచ్చిన 'వేదం' సినిమా తమిళ రీమేక్ అయిన 'వానం' ఈ నెల 29 న రిలీజ్ అవుతోంది. అనుష్క, శింబు, భరత్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి అక్కడ కూడా క్రిష్ దర్శకత్వం వహించాడు. 
*  నయనతార ప్రధాన పాత్రలో తన దర్శకత్వంలో త్వరలో ప్రభుదేవా ఓ చిత్రాన్ని రూపొందించనున్నాడని కోలీవుడ్ సమాచారం. మరో విశేషమేమిటంటే, ఈ చిత్రాన్ని వీరిద్దరే నిర్మిస్తారట కూడా. సంపాదించుకున్న నాలుగు డబ్బుల్నీ ప్రభుదేవా ఇలా ఖర్చుపెట్టే ప్లాన్ వేస్తున్నాడేమో!
*  ఆమధ్య పవన్ కల్యాణ్ నటించిన 'పులి' సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన శ్రియ మళ్లీ ఇప్పుడు 'కందిరీగ' సినిమాలో కూడా ఓ ఐటెం సాంగ్ చేస్తోందట.

స్నేహకు ఇప్పుడు తెలిసొచ్చిందట!

కథానాయిక స్నేహకి కాస్త లేటుగా జ్ఞానోదయం అయింది. సినిమా ఫీల్డులో వున్నప్పుడు సినిమా వాళ్లలానే ఉండాలన్న సంగతి ఇప్పుడు తెలుస్తున్నట్టుంది.  అందుకే, "గ్లామరస్ గా నటించడానికి నేను రెడీ" అంటూ ఈమధ్య తెగ స్టేట్ మెంట్లు ఇస్తోంది. ఇక్కడ సినిమా పరిభాషలో 'గ్లామరస్' అంటే కాస్త అందాలు ప్రదర్శిస్తూ కనిపించడం అన్న మాట. ఆ స్టయిల్లోనే ఫోటో సెషన్లు కూడా చేస్తోంది. పైగా, "ఈ వయసులో కాకపొతే ఇంకెప్పుడు ఎక్స్ పోజ్ చేస్తాం? నేనేమీ అమ్మమ్మ వయసులో లేను కదా?" అంటూ దీర్ఘాలు కూడా తీస్తోంది. అయినా ఆమెకు సినిమాల ఆఫర్లు మాత్రం రావడం లేదు. 'చేయవలసిన వయసులో ఎక్స్ పోజ్ చేయలేదు. ఇప్పుడు కెరీర్ అయిపోయాక చేస్తానంటే ఏం ప్రయోజనం?' అంటూ సినీ జనం కామెంట్ చేస్తున్నారు.

హైదరాబాదుకి 'రానా'? వద్దా?

రానా దగ్గుబాటిని చూస్తుంటే తను తెలుగు సినిమాలపై  కన్నా బాలీవుడ్ సినిమాలపైనే ప్రస్తుతం దృష్టి పెడుతున్నట్టు కనిపిస్తోంది. హిందీ ఫీల్డు నుంచి తన కెరీర్ కి సానుకూల సంకేతాలు ఎక్కువగా వస్తుండడంతో ముందు అక్కడే ఎదగాలనుకుంటున్నాడని తెలుస్తోంది. దానికి తోడు అక్కడ అభిషేక్, హృతిక్ రోషన్ వంటి యంగ్ బ్యాచ్ హీరోలతో ర్యాపో కూడా పెంచుకుంటున్నాడు.
                   త్వరలో విడుదల కాబోతున్న తన తొలి హిందీ చిత్రం 'దం మారో దం' ప్రమోషన్ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నాడు. ఈ విషయంలో ఈ మధ్య రాజస్థాన్, డిల్లీ, ముంబై వంటి పలు ప్రాంతాలు చుట్టివచ్చాడు. అక్కడ ప్రేక్షకుల నుంచి తనకి రెస్పాన్స్ కూడా చాలా బాగుందట. ఇవన్నీ చూస్తుంటే, ముంబై నుంచి హైదరాబాదుకి 'రానా'? వద్దా? అన్నట్టుగా అతని వ్యవహారం ఉందంటున్నారు.

బన్నీ, ఎన్టీఆర్ ల బాటలో ప్రభాస్!

బన్నీ, యన్టీఆర్ ల బాటలో ఇప్పుడు ప్రభాస్ కూడా పయనించనున్నాడు. అంటే, సినిమాల పరంగా కాదు... వాళ్లిద్దరిలా త్వరలో తనూ ఓ ఇంటి వాడు కానున్నాడు.  ఇటీవలే బన్నీ పెళ్లి చేసుకున్నాడు. యన్టీఆర్ మే 5 న చేసుకోబోతున్నాడు. వీళ్ళిద్దరిలా ప్రభాస్ కూడా ఈ సంవత్సరమే పెళ్లి పీటలు ఎక్కాలనుకుంటున్నాడు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభాస్ కి పెళ్లి సంబంధాలు చూడడం కూడా మొదలెట్టారని తెలుస్తోంది. అయితే సినిమా రంగానికి సంబంధం లేని అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని ప్రభాస్ అనుకుంటున్నాడట. తను లవ్ మేరేజ్ చేసుకోనున్నాడని మరికొన్ని వార్తలొస్తున్నాయి. మరి ఇంతకీ... తను లవ్ మేరేజ్ చేసుకుంటాడా? లేక పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకుంటాడా? అన్నది త్వరలో తెలుస్తుంది.

'కాఫీబార్' రిలీజ్ అయ్యేనా?

మన టాలీవుడ్ లో 'విషయం తక్కువ...కబుర్లు ఎక్కువ' టైపు దర్శకుల్లో గీతాకృష్ణ ముందు వరుసలో ఉంటాడు. తను తీసింది సాదాసీదా సినిమాలే అయినా, అవన్నీ ఆణిముత్యాలంటూ కబుర్లు మాత్రం మణిరత్నం రేంజ్ లో చెబుతాడు. ఇక విషయానికొస్తే, రెండున్నరేళ్ళ క్రితం 'కాఫీబార్' అనే సినిమా స్టార్ట్ చేశాడు. పూర్తి చేసి కూడా చాలా కాలమైంది. 'అదిగో రిలీజ్ ...ఇదిగో రిలీజ్' అంటూ ఎప్పటికప్పుడు స్టేట్ మెంట్లు ఇస్తున్నాడు తప్పితే, ఇంతవరకు రిలీజ్ చేయలేకపోయాడు. ఆమధ్య మార్చిలో రిలీజ్ అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఈ 22 న రిలీజ్ అంటున్నారు. ఇంతకీ, ఈసారైనా రిలీజ్ అవుతుందో, లేదో!

చంద్రబాబుని కలిసిన యన్టీఆర్


తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని ఈరోజు యువనటుడు ఎన్టీఆర్ తన తండ్రితో కలిసి వెళ్లి కలిశారు. ఈ మధ్య వీరి మధ్య వారసత్వం విషయంలో మనస్పర్థలొచ్చాయంటూ వార్తలు వెల్లువెత్తిన నేపథ్యంలో వీరు కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే, యన్టీఆర్ కల్సింది మాత్రం వీటి గురించి మాట్లాడడానికి కాదులెండి... మే 5 న జరుగనున్న తన వివాహానికి ఆహ్వానించడానికి మాత్రమే యన్టీఆర్ కలిశాడు. తన పెళ్లి శుభలేఖను ఇచ్చి చంద్రబాబు దంపతులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా పెళ్లి ఏర్పాట్ల గురించి చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. 'అప్పుడే పెళ్లి కళ వచ్చేసిందే' అంటూ యన్టీఆర్ ను సరదాగా కామెంట్ చేశారట కూడా. దానికి యన్టీఆర్ సిగ్గుతో నవ్వుకున్నాడట!
 


ఈసారైనా నిలబెట్టుకుంటాడా ?

'విక్రమార్కుడు' సినిమాలో విలన్ పాత్రలో చక్కగా నటించి గుర్తింపు తెచ్చుకున్న అజయ్, అలాగే కంటిన్యు అయివుంటే కనుక అతని కెరీర్ బాగానే వుండేది. అయితే, అత్యాశకు పోయి, తనూ హీరో అయిపోవాలనుకున్నాడు. ఆ ఆలోచనతోనే 'ఆ ఒక్కడు', 'సారాయి వీర్రాజు' సినిమాల్లో హీరోగా నటించాడు.  కానీ, ఆ ప్లాన్ బెడిసికొట్టింది. హీరోగా మాత్రం సక్సెస్ కాలేకపోయాడు. దాంతో ప్రస్తుతం చిన్న చిన్న పాత్రలు చేస్తున్న అజయ్ కి ఇప్పుడు ఓ పెద్ద ఆఫర్ వచ్చింది. పవన్ కళ్యాణ్ నటించే 'గబ్బర్ సింగ్' సినిమాలో హీరోకి సోదరుడిగా నటించనున్నాడని తెలుస్తోంది.  ఈ సినిమాకి హారీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కి బ్రదర్ గా నటించడమంటే అజయ్ కి బంపర్ ఆఫరే అనే చెప్పచ్చు. ఈ సినిమా అజయ్ కెరీర్ కి మళ్ళీ టర్నింగ్ పాయింట్ అవుతుందేమో చూడాలి!

అర్థంపర్థం లేని పొగడ్తలు

ముందు తరం నటులతో ఇప్పటి తరం నటులను పోల్చడం అనేది ఎప్పుడూ జరుగుతూనే వుంటుంది. అయితే, ఆ పోలిక కాస్త సమంజసంగా, అర్ధవంతంగా వుండాలి. అప్పుడే పోల్చిన వాళ్లకీ, పోల్చబడిన వాళ్లకీ గౌరవం. అయితే, ఇప్పుడు మన టాలీవుడ్ లో అలాంటి పోలికలేవీ లేవనే చెప్పాలి. ఎవరికిష్టమొచ్చినట్లు వాళ్లని ఎవరెవరితోనో పోల్చేస్తున్నారు. అసలు ఎవరిని ఎవరితో పోలుస్తున్నామన్న స్పృహ కూడా కొందరికి వుండదు. ఆమధ్య 'డేంజర్' సినిమా తీస్తున్న టైం లో కలర్స్ స్వాతిని 'కాసుకోండి... మరో సావిత్రి వచ్చేస్తోంది' అంటూ ఆకాశానికి ఎత్తేశాడు. ఇప్పుడు దర్శకుడు దశరథ్ కాజల్ ని సౌందర్యతో పోలుస్తున్నాడు. "మిస్టర్ పెర్ ఫెక్ట్  సినిమాలో  కాజల్ నటన సౌందర్యను మరపించేలా వుంది. భవిష్యత్తులో తెలుగుతెరకు తను మరో సౌందర్య అవుతుంది" అంటూ ఈ రోజు ప్రెస్ మీట్ లో స్తోత్రం అందుకున్నాడు దశరథ్. అది విన్న మీడియా వాళ్లు నవ్వుకున్నారు!  

దర్శకుడు జయంత్ అలిగాడట

తీన్ మార్' సినిమా హిట్ అయిందంటూ పవన్ కల్యాణ్ నుంచీ, ఆఫీస్ బాయ్ వరకు ఆ సినిమాకి పనిచేసిన వాళ్లంతా హ్యాపీగా సంబరాలు చేసుకుంటుంటే, దర్శకుడు జయంత్ మాత్రం నిర్మాత మీద అలిగి, ఆ సంబరాలకు దూరంగా ఉన్నాడట. అసలు సినిమాలు లేక, సక్సెస్ అసలే లేక ఖాళీగా వున్న దర్శకుడు జయంత్ కి ఈ సినిమా మరో లైఫ్ నిచ్చింది. కాబట్టి ఆయన ఇంకా హ్యాపీగానే వుండాలి కదా?
                 అయితే, జయంత్ అలా అలగడానికి అసలు కారణం ఏమిటంటే, ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన డైలాగులు బాగా ప్లస్ అయ్యాయనీ, సినిమా సక్సెస్ క్రెడిట్ నంతా ఆయనకే ఇచ్చేస్తున్నారు. దానికి తోడు జయంత్ కన్నా త్రివిక్రమ్ కే ఎక్కువ పారితోషికం ఇచ్చారట. దాంతో జయంత్ ప్రస్తుతం నిర్మాత, పవన్ కల్యాణ్ లపై అలిగి, సినిమా ప్రమోషన్ కి దూరంగా ఉంటున్నాడని తెలుస్తోంది.
Related Posts Plugin for WordPress, Blogger...